దేశ వ్యాప్తంగా జ్ఞానవాపి మసీదు వ్యవహారం చర్చనీయాంశం అయింది. వారణాసిలో కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని కూల్చి మసీదు నిర్మించారంటూ హిందు సంఘాలు చెబుతున్నాయి. ఇటీవల వారణాసి కోర్ట్ జరిపిన వీడియో సర్వేలో మసీదులోని వాజుఖానలోని కొలనులో శివలింగం బయటపడిందన్న వార్తలు బయటకు వచ్చాయి. మసీదులో వీడియో సర్వేను ఆపాలంటూ అంజుమన్ ఇంతేజామియా మసీద్ కమిటీ సుప్రీంలో పిటిషన్ వేయడం… శివలింగానికి భద్రత కల్పించాలని.. అలాగే ముస్లింలు ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.…