Delhi: ప్రధాని మోడీతో కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ భేటీ
- ప్రధాని మోడీతో కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ భేటీ
- రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించినట్లు వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో ప్రధాని మోడీని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ప్రధానితో చర్చించారు. అనంతరం శివకుమార్ మీడియాతో మాట్లాడారు. కర్ణాటకకు కేంద్ర బడ్జెట్‌లో నిధులు ప్రకటించకపోవడంతో బుధవారం ప్రధాని నరేంద్ర మోడీని కలిసినట్లు తెలిపారు. బెంగళూరు నగరంలో చేపట్టబోయే కొత్త ప్రాజెక్టులకు గ్రాంట్లు అందించాలని ప్రధానిని కోరినట్లు పేర్కొన్నారు. నీటిపారుదల, నీటి రంగాలకు నిధులు కేటాయించలేదన్నారు. అయితే బెంగళూరు ప్రాజెక్టులకు మద్దతు ఇస్తామని ప్రధాని హామీ ఇచ్చారని చెప్పారు.
ఇది కూడా చదవండి: Pakistan: F-16 యుద్ధ విమానాలను నడపలేని స్థితిలో పాక్.. ఆర్థిక ఇబ్బందులతో వ్యూహాత్మక చిక్కులు..
Also Read
- UPIకి షాక్.. కొత్త MDRపై సర్వేలో ఆసక్తికర విషయాలు.. మళ్లీ పాత రోజులే..!
- Smit Machchhar & Sandra Samuel: అప్పట్లో సాండ్రా శామ్యూల్, ఇప్పుడు స్మిత్ మచ్ఛార్..
- UPSC Centenary 2026: UPSC శతాబ్ది వేడుకలు.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వందేళ్ల చరిత్ర ఇదే
- CM Vijay: ‘రాజరికం, కుటుంబ పాలనకు TVKలో చోటు లేదు’.. ధారాపురం సభలో విజయ్ కీలక వ్యాఖ్యలు
దేశంలో అత్యధిక పన్ను చెల్లింపుదారులలో కర్ణాటక రెండవ స్థానంలో ఉందని.. పన్నుల చెల్లింపులకు బెంగళూరు అత్యధికంగా సహకరిస్తుందని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర తరహాలో కర్ణాటక ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని మోడీని కోరినట్లు చెప్పారు. సిగ్నల్ రహిత కారిడార్లు, ఫ్లైఓవర్లు కావాలని అడిగినట్లు పేర్కొన్నారు. వాటిని పరిగణలోకి తీసుకుంటానని ప్రధాని హామీ ఇచ్చారని శివకుమార్ తెలిపారు. కర్నాటకకు గతేడాది కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన రూ.5,300 కోట్ల మంజూరు అంశాన్ని కేంద్ర కేబినెట్ సమావేశంలో చర్చిస్తామని ప్రధాని హామీ ఇచ్చారని శివకుమార్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: CM Chandrababu: 5 నూతన పాలసీలు, 4 చోట్ల కొత్త క్లస్టర్లు.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
తాజావార్తలు
-
Ayushmann Khurrana : మళ్లీ గాడి తప్పుతోన్న ఆయుష్మాన్ ఖురానా సక్సెస్
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Dharmana Prasada Rao: స్థానిక ఎన్నికల్లో బీసీలకు ఏం చేస్తారో చూపించండి.. ధర్మాన సవాల్
-
India vs Pakistan: “అసలు మజా అప్పుడే”.. దాయాదుల మధ్య పసిడి పోరు..
-
Sugar Sale Quota October 2026: దసరాకు ముందు చక్కెర కోటా విడుదల.. ఈ 3 రాష్ట్రాలకే భారీ కేటాయింపులు
ట్రెండింగ్
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?