కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ ఎం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై స్పందించారు. ఇండియా టుడేతో ఆయన మాట్లాడారు. జనసమూహాన్ని నిర్వహించడానికి 5000 మంది సిబ్బందిని నియమించినట్లు స్పష్టం చేశారు. కానీ మరణాల సంఖ్యను మాత్రం నిర్ధారించలేదు. "నేను ఇంకా సంఖ్యలను నిర్ధారించలేను, నేను ఇప్పుడు స్టేడియంకు వెళ్తున్నాను. చాలా మంది భావోద్వేగ అభిమానులను చేరుకున్నారు. 5000 సిబ్బందిని మోహరించాం" అని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ ఇండియా టుడేతో అన్నారు.
శివరాత్రి వేడుకల్లో ఇషా ఫౌండేషన్ అధినేత సద్గురు జగ్గీ వాసుదేవ్‌తో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ వేదిక పంచుకోవడం రాజకీయంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. సొంత పార్టీ నేతల నుంచి డీకే.శివకుమార్‌పై తీవ్ర వ్యతిరేక వ్యక్తమైంది.
ఢిల్లీలో ప్రధాని మోడీని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ప్రధానితో చర్చించారు. అనంతరం శివకుమార్ మీడియాతో మాట్లాడారు.
Dk Sivakumar: డీకే శివకుమార్.. కర్ణాటక ఎన్నికల ఫలితాల సమయంలోనూ, అక్కడ రాజకీయ సంక్షోభం వచ్చినప్పుడల్లా ఎక్కువగా వినిపించే పేరు. గెలిచే అభ్యర్థులను జంప్ చేయడం కంటే సంక్షోభ సమయాల్లో పార్టీ ఎమ్మెల్యేలను కలిసి ఉంచడంలో ఆయన నిపుణుడు.
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీలో ఓ టీమ్ పనిచేస్తోందని ఆయన అన్నారు.
కమీషన్ (లంచం) తీసుకున్నట్లు రుజువైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు.కమీషన్ వసూలు చేశారని ఆరోపించినందుకు మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మాజీ మంత్రి ఆర్ అశోకల వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి డీకే శివకుమార్, వారి ఆరోపణలు అవాస్తవమని తేలితే ఇద్దరు బీజేపీ నాయకులు రాజకీయ రిటైర్మెంట్ ప్రకటిస్తారా అంటూ సవాల్ విసిరారు.