Dalit Boy Tied To Electric Pole, Thrashed For Alleged Theft: దళిత బాలుడిపై కర్కశంగా ప్రవర్తించారు. దొంగతనం ఆరోపణలతో విద్యుత్ స్తంభానికి కట్టేసి చావబాదారు. అడ్డొచ్చిన బాలుడి తల్లిపై కూడా దాడి చేశారు. ఈ ఘటనల కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. 14 ఏళ్ల బాలుడు చెవిపోగును దొంగిలించడనే ఆరోపణలపై పది మంది వ్యక్తుల బాలుడిని చావబాదారు. సెప్టెంబర్ 29న బెంగళూర్ సమీపంలోని దళిత వర్గానికి చెందిన బాలుడు యశ్వంత్ చెవిపోగును దొంగిలించాడని ఉన్నత వర్గం వారు ఆరోపించారు.
అంతటితో ఆగకుండా బాలుడిని కరెంట్ పోల్ కు కట్టేసి చితకబాదారు. కొడుకును కొడుతుంటే చూడలేక మధ్యలో వచ్చిన తల్లిపై కూడా దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన ఇద్దరు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఎలాంటి ప్రాణాపాయం లేదని పోలీసులు వెల్లడించారు. నా కొడుకు ఇతర అబ్బాయిలు, అమ్మాయిలతో ఆడుకుంటున్న సమయంలో చెవిపోగు దొంగిలించాడని ఉన్నత వర్గాల వారు ఆరోపణలు చేశారని.. మా కులాన్ని తుడిచిపెడుతామంటూ బెదిరించారని బాలుడి తల్లి తెలిపింది.
Read Also: IND Vs SA: లైవ్ మ్యాచ్‌లో విశేష అతిథి.. వణికిపోయిన క్రికెట్ అభిమానులు
బాలుడిపై దాడి చేసిన వ్యక్తలపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ లో 10 మంది నిందితుల పేర్లను నమోదు చేశారు పోలీసులు. ముగ్గురిని జ్యుడీషియల్ కస్టడీకి పంపగా.. పరారీలో ఉన్న మిగతావారి కోసం గాలింపు జరుగుతోంది. నాలుగేళ్ల బాలిక చెవిపోగులను బాలుడు దొంగిలించాడని స్థానికులు ఆరోపించారని.. దీనిపై విచారణ చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
మధ్యప్రదేశ్‌లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ:

మధ్యప్రదేశ్ లో నవరాత్రి వేడుకల్లో భాగంగా దుర్గామాత విగ్రహ ప్రతిష్టలో అగ్రవర్ణాలు, దళితులకు మధ్య ఘర్షణ చెలరేగింది. ఆదివారం రోజున ఇరు వర్గాలు కూడా కర్రలతో దాడులు చేసుకున్నారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ కు 200 కిలోమీటర్ల దూరంలోని అగర్ జిల్లా కంకర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. దుర్గామాత విగ్రహాన్ని ప్రతిష్టించినందుకు అగ్రవర్ణాలు తమపై దాడి చేశారని దళిత సంఘాలు ఆరోపించాయి. గర్భా ఫంక్షన్ కోసం ఇద్దరు అమ్మాయిలు చేసిన అశ్లీల డ్యాన్స్ తో గొడవ ప్రారంభం అయిందని మరోవైపు వారు ఆరోపించారు. ఈ ఘటనకు బాద్యులైన వారిని ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.