కర్ణాటకలో ప్రస్తుతం ‘పవర్ షేరింగ్’ వివాదం నడుస్తోంది. మొన్నటిదాకా హస్తిన వేదికగా చర్చలు నడవగా.. ప్రస్తుతం బెంగళూరులో బ్రేక్‌ఫాస్ట్ రాజకీయాలు నడుస్తున్నాయి. గత శనివారం సిద్ధరామయ్య ఇంట్లో డీకే.శివకుమార్ అల్పాహారం తీసుకోగా.. మంగళవారం డీకే.శివకుమార్ ఇంట్లో సిద్ధరామయ్య బ్రేక్‌ఫాస్ట్ చేశారు.
కర్ణాటకలో ప్రస్తుతం బ్రేక్‌ఫాస్ట్ రాజకీయాలు నడుస్తున్నాయి. ‘‘నీ ఇంటికి నేనొస్తా.. నా ఇంటికి నువ్వు.. రా!’’ అన్నట్టుగా సిద్ధరామయ్య-డీకే.శివకుమార్ మధ్య పాలిటిక్స్ సాగుతున్నాయి. బ్రేక్‌ఫాస్టేనా? ఇంకేమైనా? ఉందా? అన్నది మాత్రం తేలడం లేదు.
కర్ణాటక ప్రభుత్వంలో ‘పవర్ షేరింగ్’ వివాదం నడుస్తోంది. సిద్ధరామయ్య-డీకే.శివకుమార్ వర్గీయుల మధ్య పంచాయితీ సాగుతోంది. మొన్నటిదాకా హస్తిన వేదికగా హైకమాండ్‌తో ఇరు వర్గాలు చర్చలు జరిపాయి.