Kamal Nath: గతేడాది చివర్లో జరిగి మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అన్ని తానై నడిపించిన మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ బీజేపీలోకి చేరబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి బలం చేకూర్చేలా ఆయన ఈ రోజు సాయంత్రం బీజేపీ పెద్దలతో ఢిల్లీలో సమావేశమవుతారని సమాచారం. మరోవైపు ఆయన కుమారుడు చింద్వారా కాంగ్రెస్ ఎంపీ నకుల్ నాథ్ ఇప్పటికే తన సోషల్ మీడియా బయో నుంచి కాంగ్రెస్‌ని తొలగించారు. ఈ నేపథ్యంలో చేరిక లాంఛనమే అని తెలుస్తోంది.
Kamal Nath: కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో కీలక నేతలు చేజారిపోతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో ముఖ్యనేతగా, మధ్యప్రదేశ్ మాజీ సీఎంగా ఉన్న కమల్ నాథ్ బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీటికి బలం చేకూర్చేలా పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే కమల్ నాథ్ కుమారుడు నకుల్ నాథ్ సోషల్ మీడియాలో తన బయో నుంచి కాంగ్రెస్‌ని తొలగించడం వార్తలకు బలాన్ని చేకూరుస్తోంది. మరోవైపు ఈ రోజు కమల్…