Jyoti Malhotra: పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తున్న హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు కోర్టు షాక్ ఇచ్చింది. ఆమె బెయిల్ పిటిషన్‌ని తిరస్కరించింది. బెయిల్ పిటిషన్‌ని విచారించిన హిసార్ కోర్టు బెయిల్ ఇవ్వడానికి బుధవారం నిరాకరించింది. దర్యాప్తు చురుకుగా సాగుతున్న ఈ సమయంలో నిందితురాలికి బెయిల్ ఇవ్వడం దర్యాప్తును దెబ్బతీస్తుందని పోలీసులు కోర్టుకు తెలియజేశారు. ఇరు వర్గాల వాదన విన్న కోర్టు బెయిల్ పిటిషన్‌ని తిరస్కరించింది.
పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తూ హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పట్టుబడింది. పోలీసుల కస్టడీ అనంతరం ఆమెను హర్యానాలోని హిసార్ జైలుకు తరలించారు. బుధవారం జైల్లో మల్హోత్రాను తండ్రి హరీష్ కలిశారు. జరిగిన పరిణామాలను తండ్రి అడిగి తెలుసుకున్నారు.
పాకిస్తాన్ తరపున గూఢచర్యం చేసిందనే ఆరోపణలపై అరెస్టయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా బ్యాంకు ఖాతాల వివరాలను పోలీసులు సేకరించారు. జ్యోతి మల్హోత్రాతో పాటు, ఆమె తండ్రి, మామ బ్యాంకు ఖాతా వివరాలపై ఆరా తీశారు. జ్యోతి పీఎన్‌బీ ఖాతాలో పోలీసులు ఎటువంటి భారీ లావాదేవీలను గుర్తించలేదు. జ్యోతికి ఆదాయానికి మించి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో, అది ఏ ఖాతాలోకి వచ్చిందో తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. జ్యోతి పాత పీఎన్‌బీ ఖాతా వివరాలను పోలీసులు పరిశీలించగా, వారికి…
Jyoti Malhotra: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు ఉచ్చు బిగుస్తోంది. పాకిస్తాన్ తరుపున గూఢచర్యం చేసిన కేసులో ఆమెను అరెస్ట్ చేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ), ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ), సైనిక ఇంటెలిజెన్స్ సంస్థలు ఆమెను తీవ్రంగా ప్రశ్నిస్తున్నాయి. పాకిస్తా్న్‌తో ఉన్న లింకులు, పాకిస్తాన్ పర్యటనల్లో ఎవరెవరిని కలిశారు..? అని తెలుసుకునేందుకు విచారణ కొనసాగుతోంది. మే 16న హిసార్‌లోని జ్యోతిని రెస్ట్ చేశారు. ఈమెపై ‘‘అధికారిక రహస్యాల చట్టం’’, బినామీ లావాదేవీల(నిషేధం) చట్టం కింద కేసులు నమోదు చేశారు. జ్యోతి…
Spying: పాకిస్తాన్ తరుపున గూఢచర్యం చేస్తూ ప్రముఖ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో సహా 11 మది పట్టుబడటం ఆందోళన కలిగిస్తోంది. పాక్ ఐఎస్ఐ డబ్బు కోసం వీరంతా భారత సమాచారాన్ని పాకిస్తాన్‌కి చేరవేస్తున్నారు. ఇందులో జ్యోతి మల్హోత్రా విషయం కీలకంగా మారింది.
Jyoti Malhotra: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పాకిస్తాన్ ఐఎస్ఐ తరుపున గూఢచర్యం చేస్తూ పట్టుబడిన ఆమెను, ఎన్ఐఏ, ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) సంయుక్తంగా విచారిస్తున్నాయి. ప్రస్తుతం జ్యోతి ఐదు రోజుల పోలీస్ కస్టడీలో ఉంది.
Jyoti Malhotra: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పాకిస్తాన్ తరుఫున గూఢచర్యం చేస్తూ పట్టుబడిన జ్యోతి మల్హోత్రా కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీస్ దర్యాప్తులో ఈమె పాకిస్థానీ కుట్ర బయటపడింది. సులభంగా డబ్బులు సంపాదించడం, విలాసవంతమైన జీవితం కోసం జ్యోతి దేశాన్ని మోసం చేసేలా యూట్యూబర్ ప్రయత్నించినట్లు తెలుస్తోంది.
Jyoti Malhotra: సోషల్ మీడియాలో లక్షల్లో ఫాలోవర్స్. మంచిగానే ఆదాయం వస్తూ ఉంటుంది. అయినా కూడా, హర్యానాకు చెందిన యూట్యూబర్ శత్రుదేశం పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తూ దొరికిపోయింది. ట్రావెల్ వ్లాగర్ జ్యోతి మల్హోత్రాతో పాటు ఆరుగురిని గూఢచర్యం చేస్తున్న కారణంగా ఈ రోజు అరెస్ట్ చేశారు. హర్యానా, పంజాబ్ ప్రాంతాల్లో ప్రముఖ యూట్యూబర్‌గా పేరు తెచ్చుకున్న జ్యోతి మల్హోత్రా ఈ వ్యవహారంలో అరెస్ట్ కావడం సంచలనంగా మారింది.