రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే. అద్వానీ తన సభ్యత్వాన్ని పునరుద్ధరించుకున్నారు. గురువారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. అద్వానీ నివాసానికి వెళ్లి సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. సభ్యత్వ పునరుద్ధరణ కాపీని అద్వానీకి నడ్డా అందజేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలాగే సాయంత్రం సీనియర్ నాయకుడు మురళీ మనోహర్ జోషి నివాసానికి వెళ్లి సభ్యత్వాన్ని పునరుద్ధరించారు.
ఇది కూడా చదవండి: IC 814 Hijack: IC 814 ఫ్లైట్ హైజాక్.. ఉగ్రవాది శవాన్ని హైజాకర్లు ఎందుకు కోరారు..? సజ్జాద్ ఆఫ్ఘనీ ఎవరు..?
రాబోయే ఎన్నికల కోసం.. అలాగే పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేసుకునే లక్ష్యంతో బీజేపీ సెప్టెంబర్ 2న సభ్యత్వ డ్రైవ్‌ను ప్రారంభించింది. మహిళలు, యువత, సాంప్రదాయకంగా బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో పునాదిని విస్తరించేందుకు ప్రత్యేక కృషి చేయాలని బీజేపీ సభ్యులను ప్రధాని నరేంద్ర మోడీ కోరారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాధామోహన్ దాస్ అగర్వాల్ గురువారం ఉదయం సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి విజయ్ కుమార్ మల్హోత్రా ఇంటికి వెళ్లి పార్టీ సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. ఈ కార్యక్రమంలో వాయువ్య ఢిల్లీ ఎంపీ యోగేంద్ర చందోలియా కూడా పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: CM Chandrababu: మానవ తప్పిదాల వల్లే భారీ వరదలు.. బుడమేరు గండ్లను పూడ్చేందుకు ఆర్మీ రంగంలోకి..!
రాజ్యాంగంలోని ఆర్టికల్ 9 ప్రకారం ప్రతి ఆరు సంవత్సరాలకు సభ్యత్వాన్ని పునరుద్ధరించాలి. ఇప్పటికే ఉన్న మెంబర్‌షిప్‌లు పునరుద్ధరించబడడంతో పాటు కొత్త సభ్యులు చేరే అవకాశం ఉంటుంది. బీజేపీ సభ్యత్వ ప్రచారాన్ని ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే పర్యవేక్షిస్తున్నారు. ఈసారి 10 కోట్ల మంది సభ్యుల లక్ష్యాన్ని సాధించాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది.
भारतीय जनता पार्टी के वरिष्ठ नेता, हम सभी के आदर्श आदरणीय श्री लालकृष्ण आडवाणी जी के नई दिल्ली स्थित आवास पर उन्हें 'भारतीय जनता पार्टी- राष्ट्रीय सदस्यता अभियान' के अंतर्गत सदस्यता के नवीनीकरण की प्रति दी।
संगठन के लिए आपका अखंड समर्पण वंदनीय है और सदैव हमें प्रेरणा प्रदान करते… pic.twitter.com/fRWyeftxGb
— Jagat Prakash Nadda (@JPNadda) September 5, 2024