JP Nadda: మోడీ కేబినెట్లోకి జేపీ నడ్డా.. బీజేపీకి కొత్త చీఫ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JP Nadda: చారిత్రాత్మక ఘట్టాని సమయం ఆసన్నమైంది. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించిన తర్వాత వరసగా మూడోసారి ప్రధాని నరేంద్రమోడీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ రోజు సాయంత్రం 7.15 గంటలకు మోడీ బాధ్యతలు చేపట్టనున్నారు. మోడీతో పాటు ఆయన కేబినెట్లో చేరబోతున్న ఎంపీలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే మంత్రిపదవులు దక్కిన వారికి సమాచారం వెళ్లింది. వారంతా ఢిల్లీ చేరుకున్నారు. మరోవైపు ఈ కార్యక్రమానికి భారత మిత్రదేశాలైన భూటాన్, బంగ్లాదేశ్, మారిషస్, మాల్దీవులు, శ్రీలంక, నేపాల్, సీషెల్స్ వంటి దేశాల అధినేతలు ఢిల్లీకి చేరుకున్నారు.
ఇదిలా ఉంటే, బీజేపీ జాతీయాధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డాను మోడీ మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ప్రధానితో పాటు మొత్తం 30 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. వీరిలో జేపీ నడ్డా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 2014-2019లో నరేంద్రమోడీ తొలి ప్రభుత్వంలో నడ్డా మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ఆయన ఆరోగ్యమంత్రిత్వ శాఖ చూశారు. 2020లో అమిత్ షా స్థానంలో జేపీ నడ్డాను బీజేపీ జాతీయాధ్యక్షుడిగా చేశారు. సెప్టెంబర్ 2022లో నడ్డా పదవీకాలం ముగిసినప్పటికీ, 2024 సార్వత్రిక ఎన్నికల వరకు పొడగించారు. ఇదే జరిగితే బీజేపీకి కొత్తగా జాతీయాధ్యక్షుడు వచ్చే అవకాశం ఉంది.
Also Read
- TMC Rebellion: మమతా బెనర్జీకి కోలుకోలేని దెబ్బ.. పక్కా ప్లాన్‌తో పార్టీని వీడిన ఆ 20 మంది ఎంపీలు..
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
మోడీ 3.0 కేబినెట్లో ఈ సారి మిత్రపక్షాలైన తెలుగుదేశం, జేడీయూ, శివసేనలకు ప్రాధాన్యత లభిస్తోంది. టీడీపీకి చెందిన కె రామ్మోహన్ నాయుడు, చంద్రశేఖర్ పెమ్మసాని, జెడి(యు) నుండి లల్లన్ సింగ్, రామ్‌నాథ్ ఠాకూర్లు నేడు ప్రమాణస్వీకారం చేస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. రాష్ట్రీయ లోక్‌దళ్‌కు చెందిన జయంత్ చౌదరి, లోక్ జనశక్తి పార్టీ ఆర్వి చిరాగ్ పాశ్వాన్, శివసేనకు చెందిన ప్రతాప్ రావ్ జాదవ్, హెచ్ఎఎం జితన్ రామ్ మాంఝీ, ఎజెఎస్‌యుకు చెందిన చంద్ర ప్రకాష్ చౌదరి, ఆర్‌పిఐకి చెందిన రాందాస్ అథవాలే, అప్నాదళ్ నుంచి అనుప్రియా పటేల్, జేడీఎస్ నుంచి కుమారస్వామిలకు మంత్రి పదవులు దక్కబోతున్నాయి.
తాజావార్తలు
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కలకలం.. బెన్ స్టోక్స్‌పై వేటు తప్పదా?
-
Obsession Heroine : ‘అబ్సెషన్’ గర్ల్‌ను పరిచయం చేసింది మన దర్శకుడే !
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
TMC Rebellion: మమతా బెనర్జీకి కోలుకోలేని దెబ్బ.. పక్కా ప్లాన్‌తో పార్టీని వీడిన ఆ 20 మంది ఎంపీలు..
-
OTT Releases This Week : తెలుగు నుంచి మలయాళం వరకు… ఈవారం ఓటీటీలో మస్ట్ వాచ్ మూవీస్
ట్రెండింగ్
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?