ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచంలోనే కొత్త రికార్డ్‌ను నమోదు చేసింది. నవంబర్ 21, 2025న 24 గంటల్లో 1,036 విమాన రాకపోకలు నిర్వహించి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది.
ఇది కూడా చదవండి: PM Modi: నేడు అయోధ్యలో కాషాయ జెండా ఆవిష్కరించనున్న మోడీ.. విశిష్టతలు ఇవే!
ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ముంబై ఎయిర్‌పోర్ట్ ఒకటి. ప్రపంచంలోనే పెద్ద విమానాశ్రయాల వరుసలో ముంబై ఎయిర్‌పోర్టు నిలుస్తుంది. ఢిల్లీ, లండన్, దుబాయ్, న్యూయార్క్ మాదిరిగా రెండు రన్‌వేలు ఒకేసారి పని చేయగల సామర్థ్యం ముంబై ఎయిర్‌పోర్టు సొంతం. దీంతో నవంబర్ 21న ప్రతి 100 సెకన్లలోపు 1,036 టేకాఫ్‌లు, ల్యాండింగ్‌లు జరిగాయి. దీంతో మరోసారి ముంబై ఎయిర్‌పోర్టు తన రికార్డ్‌ను తానే తిరిగరాసింది. నవంబర్ 21, 2023లో కూడా 1,032 విమానాల రాకపోకలు జరిగాయి. తాజాగా 1,036 విమాన రాకపోకలు జరిగించి వరల్డ్ రికార్డ్ సృష్టించింది. ఇందులో 755 దేశీయ విమానాలు, 281 అంతర్జాతీయ విమానాలు ఉన్నాయి. 520 వచ్చే విమానాలు, 516 టేకాఫ్ అయిన విమానాలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Meerut: భర్తను చంపి డ్రమ్‌లో పెట్టిన ముస్కాన్ తల్లైంది.. కుమార్తె జననం.. ఎనిమిది నెలలుగా తన ప్రేమికుడితో జైలులోనే
ఇక నవంబర్ 21న 170,488 మంది ప్రయాణికుల రాకపోకలు జరిగాయి. దేశీయ మార్గాల్లో 121,527 మంది ప్రయాణికులు, 48, 961 మంది అంతర్జాతీయ ప్రయాణికులు ప్రయాణం చేశారు. దేశీయ మార్గాల్లో ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్, హైదరాబాద్, కోల్‌కతా నగరాలకు ఈ ప్రయాణాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఇక అంతర్జాతీయంగా దుబాయ్, అబుదాబి, లండన్ హీత్రో, దోహా, జెడ్డా వంటి నగరాలకు వెళ్లినట్లు పేర్కొన్నారు. జనవరి 11, 2025న కూడా ముంబై ఎయిర్‌పోర్టు నుంచి అత్యధిక సంఖ్యలో ప్రయాణం చేశారు. ఆ ఒక్క రోజే 170,516 మంది ప్రయాణించారు. దేశంలో సహజంగా ఢిల్లీలో రద్దీగా ఉంటుంది. అలాంటిది ముంబై నుంచి కూడా ఆ స్థాయిలో ప్రయాణాలు జరుగుతున్నాయి.