Iran War: భారత్‌కు వస్తున్న ఇరాన్ చమురు నౌక చైనాకు మళ్లింపు.. కారణం ఏమిటి..?
- భారత్ వస్తున్న ఇరాన్ ఆయిల్ నౌక చైనాకు మళ్లింపు..
- 2019 తర్వాత తొలిసారిగా భారత్‌కు ఇరాన్ ఆయిల్..
- పేమెంట్ వ్యవస్థ వల్లే మళ్లింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran War: ఇరాన్ నుంచి క్రూడాయిల్‌తో భారత్‌కు వస్తున్న నౌక, చైనాకు మళ్లించబడింది. అమెరికా ఆంక్షలకు గురైన ఈ ట్యాంకర్ భారత్ వస్తున్న సమయంలోనే తన మార్గాన్ని మార్చుకుంది. ఈ షిప్ భారత్‌కు వచ్చి ఉంటే 2019 తర్వాత, ఇరాన్ నుంచి చమురు కొనడం ఇదే తొలిసారి అయ్యేది. 2025లో అమెరికా ఆంక్షలకు గురైన అఫ్రామాక్స్ ట్యాంకర్ ‘పింగ్ షున్’, ఈ వారం ప్రారంభంలో సూచించిన గుజరాత్‌లోని వడినార్‌కు బదులుగా, ఇప్పుడు చైనాలోని డోంగింగ్‌కు తన దిశను మార్చుకున్నట్లు ట్రాకింగ్ డేటా వెల్లడించింది.
Read Also: Bengal hostage row: ఎంఐఎం నాయకుడే మల్దా ఘటన సూత్రధారి.. పారిపోతుండగా అరెస్ట్..
Also Read
- Chandipura virus: 22 మంది చిన్నారులు మృతి.. ఏమిటి చండీపుర వైరస్.? మెదడుపై ఎలా దాడి చేస్తుంది.?
- Udhayanidhi Stalin Case: ఉదయనిధి స్టాలిన్ కేసులో హైడ్రామా.. పోలీస్ వ్యాన్ దిగేందుకు నిరాకరణ.. ఉత్కంఠ..!
- MK Stalin: 'డమ్మీ సీఎం.. రీల్స్ క్రియేటర్'.. విజయ్‌పై స్టాలిన్ తీవ్ర విమర్శలు
- Sheikh Hasina: షేక్ హసీనా ప్రెస్‌మీట్‌పై బంగ్లాదేశ్ అభ్యంతరం.. భారత్ రియాక్షన్ ఇదే!
అయితే, ఇలా మార్గం మధ్యలో భారత్ నుంచి చైనాకు వెళ్లడం వెనక కారణం చెల్లింపులు సమస్యలే అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నౌకపై అమెరికా ఆర్థిక ఆంక్షలు విధించిన కారణంగా డబ్బు లావాదేవీలు సమస్యగా మారాయి. ముఖ్యంగా ఇరాన్‌ను అంతర్జాతీయ బ్యాంకింగ్ నెట్వర్క్ స్విఫ్ట్ నుంచి తొలగించడం వల్ల చెల్లింపులు కష్టంగా మారాయి.
గతంలో 30-60 రోజులు క్రెడిట్‌పై డీల్స్ ఉండేవి, అయితే ఇప్పుడు అమ్మకందారులు ముందస్తు చెల్లింపుల్ని కోరుతున్నారు. ఇండియన్ రిఫైనరీలు ఈ రిస్క్ తీసుకోవడంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. ఇలాంటి వాణిజ్యానికి చైనా ముందుంది. ఈ కారణాల వల్లే చమురు నౌక తన దిశను మార్చుకుని చైనాకు వెళ్తుందని భావిస్తున్నారు. గతంలో ఇరాన్ నుంచి భారత్ పెద్ద ఎత్తున ఆయిల్ దిగుమతి చేసుకునేది. కానీ యూఎస్ ఆంక్షల కారణంగా 2019లో నిలిపేసింది. ఇప్పుడు యుద్ధం నేపథ్యంలో ఆయిల్ సంక్షోభం కారణంగా భారత్ మళ్లీ ఇరాన్ ఆయిల్ కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంది. ఇందుకు అమెరికా తాత్కిలిక సడలింపుల్ని కూడా ఇచ్చింది. అయితే, చెల్లింపుల వ్యవస్థ ఇక్కడ అడ్డంకిగా మారింది.
తాజావార్తలు
-
US-Iran: హార్ముజ్ తెరుచుకుంటుందా? అమెరికా కీలక ప్రకటన
-
Varun Tej Leg Injury: ఆ ఒక్క గాయం వరుణ్ తేజ్ జీవితాన్ని మార్చేసిందట..!
-
Chandipura virus: 22 మంది చిన్నారులు మృతి.. ఏమిటి చండీపుర వైరస్.? మెదడుపై ఎలా దాడి చేస్తుంది.?
-
Udhayanidhi Stalin Case: ఉదయనిధి స్టాలిన్ కేసులో హైడ్రామా.. పోలీస్ వ్యాన్ దిగేందుకు నిరాకరణ.. ఉత్కంఠ..!
-
ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!