Rahul Gandhi: పరిహారానికి, బీమాకి మధ్య తేడా తెలియదా.. మోడీ సర్కార్పై రాహుల్ ఫైర్
- అగ్నివీరుడు అజయ్ కుమార్ కుటుంబానికి ఎలాంటి పరిహారం అందలేదు..
- పరిహారానికి- ఇన్సూరెన్స్ కు మధ్య తేడా కూడా కేంద్ర ప్రభుత్వానికి తెలియదా..
- కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: విధి నిర్వహణలో అమరుడైన ‘అగ్నివీరుడు’ అజయ్ కుమార్ ఫ్యామిలీకి ఎలాంటి పరిహారం అందలేదని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిహారానికి, ఇన్సూరెన్స్ కు మధ్య తేడా ఉంటుందని సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఓ వీడియోని షేర్ చేశారు. ప్రైవేటు బ్యాంక్ నుంచి 50 లక్షల రూపాయలు, ఆర్మీ గ్రూప్ ఇన్సూరెన్స్ ఫండ్ నుంచి రూ.48 లక్షలు అందినట్లు అజయ్ కుమార్ తండ్రి అందులో ఆయన చెప్పారు. ఇక, ఈ వీడియోని షేర్ చేస్తూ.. అమరవీరుడి కుటుంబానికి కేంద్రంలోని బీజేపీ సర్కార్ నుంచి పరిహారం లేదా ఎక్స్‌గ్రేషియా చెల్లింపులు జరగలేదన్నారు. పరిహారానికి, ఇన్సూరెన్స్ కు మధ్య వ్యత్యాసం ఉంది.. అమరవీరుడి కుటుంబానికి బీమా కంపెనీ ద్వారా మాత్రమే చెల్లింపులు జరిగాయని రాహుల్ గాంధీ ఆరోపించారు.
Read Also: Jai Hanuman: ఆ హీరోనే హనుమాన్ గా ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటున్న నిర్మాత
Also Read
- Bihar: బీహార్ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్.. వీడియోను తొలగించాలని ఆదేశం
- Bihar: బీహార్‌లో దారుణం.. నడిరోడ్డుపై బాలికపై లైంగిక వేధింపులు.. ముగ్గురు అరెస్ట్
- IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
- Sinchana Santosh: విద్యార్థిని సంచలనం.. 15 ఏళ్లకే పెట్టుబడులపై పట్టు.. రూ.13.9 లక్షల ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియో
అయితే, దేశం కోసం ప్రాణత్యాగం చేసే ప్రతి అమరవీరుడి కుటుంబాన్ని గౌరవించాలని విపక్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కానీ మోడీ ప్రభుత్వం అమరవీరుల పట్ల వివక్ష చూపుతోందని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ప్రభుత్వం ఏం చెప్పినా ఊరుకునేది లేదు.. ఇది దేశభద్రతకు సంబంధించిన అంశమన్నారు. పదే పదే ఈ సమస్యను లేవనెత్తుతానని అతడు చెప్పుకొచ్చారు. ఇకపోతే, రాహుల్ గాంధీ షేర్ చేసిన వీడియోలో.. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి డబ్బులు రాలేదని అగ్నివీర్ అజయ్ కుమార్ తండ్రి చెప్పారు. అలాగే పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పాటు తన కుటుంబానికి క్యాంటీన్ కార్డు ఇప్పించాలన్నాడు. అమరవీరుల కుటుంబాలకు కోటి రూపాయలు ఇచ్చామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.. కానీ, మాకు అది రాలేదని అజయ్ కుమార్ తండ్రి వెల్లడించారు.
తాజావార్తలు
-
Emo Emo idi: అక్టోబర్ 30న థియేటర్లలోకి శైలేష్ కొలను ‘ఏమో ఏమో ఇది’
-
TGPSC Syllabus Changes: సిలబస్ మార్పులపై TGPSC కీలక ప్రకటన..
-
Bihar: బీహార్ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్.. వీడియోను తొలగించాలని ఆదేశం
-
Varupula Subbarao Resigns from YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి వరుపుల సుబ్బారావు గుడ్‌బై.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక..
-
Monkey Massage: “మంకేశ్ భాయ్‌ని డిస్టర్బ్ చేయకండి”.. బార్బర్ షాపులో కోతి మసాజ్ రచ్చ! వీడియో వైరల్..
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!