Jai Hanuman: ఆ హీరోనే హనుమాన్ గా ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటున్న నిర్మాత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Charan in my personal first Preference for Hanuman Role says Chaitanya Reddy: హనుమాన్ సినిమా ఈ ఏడాది జనవరి నెలలో విడుదలై ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా తరువాత జై హనుమాన్ సినిమాకి సంబంధించి హనుమంతుడిగా ఎవరు నటిస్తారనే విషయం మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కళ్లు చిరంజీవిది పోలి ఉండడం బాడీ రానాని పోలి ఉండడంతో వారిద్దరిలో ఎవరో ఒకరిని హనుమంతుడిగా తీసుకుంటారనే ప్రచారం జరుగుతూ వచ్చింది. అయితే ఇదే విషయం మీద తాజాగా స్పందించారు హనుమాన్ నిర్మాత చైతన్య రెడ్డి. ఈ సినిమా కేవలం మేము హనుమంతుల వారి వల్లే చేసామని అనుకుంటున్నాం. మా జర్నీని మొదలుపెట్టించింది ఆయనే, ఆయన వల్లే ముందుకు వెళ్తున్నామని ఆమె అన్నారు. ఆయన తన పాత్రలో ఏ హీరోని చూడాలనుకుంటే ఆ హీరోతోనే సినిమా జరుగుతుంది అని ఆమె ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అయితే తాము ఈ పాత్ర ఓపెన్ గా ఉంచామని స్టార్ హీరోలు ఎవరు చేసినా బాగుంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే నా పర్సనల్ ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం రామ్ చరణ్ కి ఉంటుంది లేదా ఆయన తండ్రి చిరంజీవి నటించిన బాగుంటుందని ఆమె అన్నారు.
Jai Hanuman: జై హనుమాన్ రిలీజ్ డేట్ అప్డేట్ ఇచ్చిన నిర్మాత
Also Read
అయితే వాళ్లు సినిమా పాత్రను ఒప్పుకునేదాన్ని బట్టి ముందుకు వెళతామని చెప్పుకొచ్చారు. అయితే నిరంజన్ రెడ్డి గారిని అడిగితే ఆయనకి పర్సనల్ గా ఇంకా ఎవరైనా చేస్తే బాగుంటుందేమో అనిపించి ఉండవచ్చు అని అన్నారు. అందుకే అంటున్నాను హనుమంతుల వారు పాత్ర ఎవరిచేత చేయిస్తారో ఆయన ఇష్టం అంటూ ఆమె కామెంట్ చేశారు. ఇక ఇదే ఇంటర్వ్యూలో ఆమె సినిమా రిలీజ్ డేట్ గురించి కూడా ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చేశారు. హనుమాన్ సినిమా చివర్లో జై హనుమాన్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అయితే ఇప్పుడు మాత్రం చైతన్య రెడ్డి ఆ సినిమా మినిమం రెండేళ్లయినా పట్టే అవకాశం ఉన్నట్లుగా కామెంట్ చేశారు. ఎందుకంటే జై హనుమాన్ సినిమాలో ఈ హనుమాన్ ఫ్రాంచైజ్ లో ఉన్న అందరు హీరోలను తీసుకురావాలని అనుకుంటున్నారని దానికి తగ్గట్టు స్క్రిప్ట్ లో కూడా మార్పులు చేర్పులు చేశారని అన్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉందని సంక్రాంతికి రావడం అయితే అసాధ్యమే అని ఆమె కామెంట్ చేశారు. కనీసం రెండేళ్లన్నా పడుతుందంటూ ఆమె అభిప్రాయపడ్డారు. హనుమాన్ ఇంత పెద్ద సక్సెస్ అవుతుందని మేము అనుకోలేదు, ఇప్పుడు ఆ సక్సెస్ ని గౌరవిస్తూ రెండో భాగాన్ని అంతకుమించి ప్రేక్షకులను అలరించే విధంగా తీర్చేదిద్దుతున్నామని ఆమె అన్నారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!