అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాన్ కారణంగా దేశ వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక కర్ణాటక, మహారాష్ట్రలో అయితే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో మహారాష్ట్రలోని గడ్చిరోలికి చెందినదిగా తెలుస్తుంది. ఈ వీడియోలో స్టేట్ ట్రాన్స్ పోర్ట్ బస్సు డ్రైవర్ ఒక చేతిలో గొడుగు పట్టుకుని మరో చేత్తో స్టీరింగ్ తిప్పుతూ.. బస్సును నడిపిస్తుండటం మనం చూడొచ్చు. బస్సు టాప్ నుంచి వర్షం నీరు కారుతున్నదని గ్రహించి.. ఆ డ్రైవర్ ఇలా గొడుగు పట్టుకున్నాడు.