Suvendu Adhikari: బీజేపీ ప్రభుత్వానికి బుద్ధదేవ్ భార్య కితాబు.. సీపీఎం ప్రశంసలపై బెంగాల్లో చర్చ
- బీజేపీ ప్రభుత్వంపై మాజీ సీఎం బుద్ధదేవ్ భార్య ప్రశంసలు..
- సువేందు అధికారి పాలనపై లెఫ్ట్ కితాబు..
- బెంగాల్లో చర్చనీయాంశంగా మారిన మీరా భట్టాచార్జీ వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య భార్య మీరా భట్టాచార్య బీజేపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన బీజేపీ ప్రభుత్వం హామీలను వేగంగా అమలు చేస్తోందని ఆమె అన్నారు. బెంగాలీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. కొత్త ప్రభుత్వం కేవలం కొన్ని రోజుల్లోనే హామీలను అమలు చేయడం ప్రశంసనీయం అని, హామీల అమలు వేగాన్ని చూస్తే సంతోషంగా ఉందని చెప్పారు. రాష్ట్ర సంక్షేమం కోసం పనిచేస్తున్న వారు గౌరవానికి అర్హులు అని ఆమె మాట్లాడారు.
సీఎం సువేందు అధికారి గురించి మాట్లాడుతూ.. ఆయనను వ్యక్తిగతంగా ఎప్పుడూ కలవలేదని, కానీ బెంగాల్ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తారనే ఆశాభావం ఉందని చెప్పారు. పాలన విషయంలో టీఎంసీ, లెఫ్ట్ ప్రభుత్వానికి పోలిక లేదని చెప్పారు. లెఫ్ట్ 34 ఏళ్ల పాలన, టీఎంసీ 15 ఏల్ల పాలనకు మధ్య పోలికను తోసిపుచ్చారు. నందన్, విద్యాసాగర్ సేతు, సాహిత్య అకాడమీ, శిశు కిషోర్ అకాడమీ వంటి అనేక కీలక సంస్థలు, మౌలిక సదుపాయాలను స్థాపించిన ఘటన లెఫ్ట్ ప్రభుత్వానిది అని, వ్యవసాయంలో బెంగాల్‌ను దేశంలో అగ్రగామిగా చేసిందని అన్నారు.
Also Read
- DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
- Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
- Nirmala Sitharaman: "మరో సంక్షోభం ముంచుకొస్తోంది".. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
సింగూర్ వివాదాన్ని ప్రస్తావిస్తూ.. టాటా మోటార్స్ ఆటోమొబైల్ ప్రాజెక్ట్‌ను వ్యతిరేకించినందుకు చాలా మంది స్థానికులు ఇప్పుడు బాధపడుతున్నారని ఆమె పేర్కొన్నారు. ఒక వేళ ఈ ఫ్యాక్టరీ స్థాపించబడి ఉంటే బెంగాల్ ఆర్థిక ముఖచిత్రమే మారిపోయేదని చెప్పారు. తన భర్త బుద్ధదేవ్ భట్టాచార్య విజన్ ఈ ప్రాజెక్టుకు మాత్రమే పరిమితం కాలేదని, రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి కల్పించడం ఆయన లక్ష్యమని చెప్పారు.
గత 15 ఏళ్ల టీఎంసీ పాలనలో అన్ని రంగాలు క్షీణించాయని ఆమె ఆరోపించారు. లెఫ్ట్ ఫ్రంట్ భవిష్యత్తు గురించి మాట్లాడుతూ.. మీనాక్షి ముఖర్జీ, దీప్సితా ధర్ వంటి యువ నాయకులు పార్టీని పునర్నిర్మించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారని అన్నారు. బెంగాల్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం చూడాలన్నదే తన భర్త కల అని మీరా భట్టాచార్జీ అన్నారు. కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం బెంగాల్ పూర్వ వైభవాన్ని, కీర్తిని పునరుద్ధరిస్తే దానిని తప్పకుండా స్వాగతిస్తానని చెప్పారు.
తాజావార్తలు
-
DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
-
Naga Vamsi: “నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు” సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
-
Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?