India fertility rate: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో సంతానోత్పత్తి రేటు(ఫర్టిలిటీ రేట్) పడిపోతోంది. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు తక్కువ సంతానోత్పత్తి రేటును ఎదుర్కొంటున్నాయి. ఇదిలా ఉంటే ఇండియాలో కూడా సంతానోత్పత్తి రేటు 1950లో దాదాపుగా 6.2 శాతంగా ఉంటే 2021 నాటికి 2కి పడిపోయినట్లు ది లాన్సెట్ అధ్యయనం తెలిపింది.