India-Pakistan: ఈ ఏడాడి జూలై నెలలో రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన అంజూ అనే 34 ఏళ్ల యువతి తన ఫేస్‌బుక్ ఫ్రెండ్‌ని కలుసుకునేందుకు పాకిస్తాన్ వెళ్లింది. ఆ సమయంలో ఈ వార్త దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పాకిస్తాన్‌లోనే తన స్నేహితుడు నస్రుల్లాను పెళ్లి చేసుకుంది. అంజూ ఇస్లాంలోకి మారినట్లు పాక్ మీడియా వెళ్లడించింది. అప్పటి నుంచి ఈ జంట పాకిస్తాన్ లోని ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో నివాసం ఉంటున్నారు.
అయితే ఇలా వెళ్లిన అంజూ తాజాగా ఇండియాకు తిరిగి వచ్చింది. ముందుగా నస్రుల్లాను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని, వీసా గడువు ముగియడంతో ఆగస్టు 20న ఇండియా తిరిగి వస్తానని పేర్కొంది. అయితే ఆ తర్వాతి రోజే అంజూ, నస్రుల్లాను పెళ్లి చేసుకుంది. పాక్ ప్రభుత్వం కూడా ఆమె వీసాను మరో ఏడాది పొడగించింది. అయితే ఇటీవల ఆమె వాఘా బోర్డర్ ద్వారా తిరిగి భారత్ తిరిగి వచ్చింది. ఇస్లాంలోకి మారిన అంజూ ఆమె పేరున ఫాతిమాగా మార్చుకుంది.
Read Also: Union Cabinet: రేషన్ కార్డు ఉన్నవారి కేంద్రం శుభవార్త.. PMGKAY పొడగింపు
అయితే.. సెప్టెంబర్ నెలలో తన భార్య అంజూ, తన ఇద్దరు పిల్లల్ని విడిచిపెట్టి వచ్చినందుకు మానసికంగా కుమిలిపోతోందని ఆమె భర్త నస్రుల్లా చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆమె తిరిగి ఇండియాకు వచ్చినట్లు తెలుస్తోంది. రాజస్థాన్ భివాడి జిల్లాకు చెందిన అంజూకు అప్పటికే వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఫేస్‌బుక్ ఫ్రెండ్ అయిన నస్రుల్లాతో ప్రేమలో పడిన అంజూ, అతడిని కలిసేందుకు పాక్ వెళ్లింది.
భర్తకు జైపూర్ వెళ్తున్నానని చెప్పి, సరిహద్దు దాటింది. అయితే ఇండియాలోని భర్త అరవింద్ ద్వారా టచ్‌లో ఉన్న అంజూ.. తాను లాహోర్ వెళ్లినట్లు, రెండుమూడు రోజుల్లో తిరిగి వస్తానని చెప్పినట్లు అతను చెప్పాడు. ఇండియాలోని భర్త అరవింద్ తన భార్య అంజూ ఏదో రోజు తిరిగి వస్తుందనే నమ్మకాన్ని పెట్టుకున్నాడు. అంజూ, అరవింద్ ఇద్దరూ క్రైస్తవ మతంలోకి మారి పెళ్లి చేసుకున్నారు.