US F-1 Visas: భారతీయ విద్యార్థులకు భారీగా తగ్గిన అమెరికా వీసాలు..
- భారతీయు విద్యార్థులకు భారీగా తగ్గిన యూఎస్ వీసాలు..
- 38 శాతం వరకు క్షీణత, మహమ్మారి తర్వాత ఇదే తొలిసారి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US F-1 Visas: అమెరికాలో చదువుకోవాలనేది భారతీయ విద్యార్థుల కల. స్టూడెంట్స్ మాత్రమే కాదు వారి తల్లిదండ్రులు కూడా మా అబ్బాయి అమెరికాలో చదువుకుంటున్నాడని గొప్పగా చెబుతూ మురిసిపోతుంటారు. అయితే, 2024 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు భారతీయ విద్యార్థుల వీసాలు భారీగా తగ్గినట్లు యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. యూఎస్ F-1 వీసాలలో 38 శాతం తగ్గినట్లు చెప్పింది. అయినప్పటికీ, అమెరికా వెళ్లే విదేశీ విద్యార్థుల్లో భారతీయులే టాప్ ప్లేస్‌లో ఉన్నారు.
భారతీయ విద్యార్థులకు ఇచ్చే స్టడీ వీసాలు భారీగా తగ్గుతున్నాయి. బ్యూరో ఆఫ్ కాన్సులర్ అఫైర్స్ యొక్క నెలవారీ నివేదికల డేటా ప్రకారం.. 2024 తొలి తొమ్మిది నెలల్లో భారతీయ విద్యార్థులకు 64,008 F-1 వీసాలు మంజూరు చేయబడ్డాయి. 2023లో ఇదే కాలానికి 1,03,495 వీసాలు జారీ అయ్యాయి. కోవిడ్ మహమ్మారి తర్వాత ఇలా వీసాలు తగ్గడం ఇదే తొలిసారి. జనవరి 2022 మరియు సెప్టెంబర్ 2022 మధ్య మొత్తం 93,181 మంది భారతీయ విద్యార్థులకు F-1 వీసాలు ఇవ్వబడ్డాయి, అయితే 2021లో వాటి సంఖ్య 65,235కి చేరుకుంది.
Also Read
- ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..
- Salary Hike 2026-27: ఉద్యోగులకు గుడ్న్యూస్.. భారీగా పెరగనున్న జీతాలు!.. ఏ రంగంలో ఎక్కువంటే?
- Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీని వెంబడిస్తున్న కేసులు.. కోర్టు సమన్లు జారీ..
- Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
Read Also: Minister Payyavula Keshav: శ్రీశైలం నుంచి నీటి వినియోగంపై తెలంగాణతో సంప్రదింపులు..
ఇదిలా ఉంటే చైనా విద్యార్థుల వీసాల్లో కూడా తగ్గుదల కనిపిస్తోంది. అమెరికాలో భారతీయ విద్యార్థుల తర్వాతి స్థానం చైనా వాళ్లదే. 2024 మొదటి తొమ్మిది నెలల్లో మొత్తం 73,781 F-1 వీసాలు చైనీస్ విద్యార్థులకు జారీ చేయబడ్డాయి, 2023లో అదే సమయంలో జారీ చేయబడిన 80,603 వీసాలు మంజూరయ్యాయి. 2024లో ఇండియన్ స్టూడెంట్స్, చైనీస్ నాన్ మైగ్రెంట్స్‌ని అధిగమించి అమెరికాలో అతిపెద్ద విదేశీ విద్యార్థి సమూహంగా అవతరించారు. ఓపెన్ డోర్స్ 2024 నివేదిక ప్రకారం, 2023-24 విద్యా సంవత్సరంలో 3,31,000 మంది భారతీయ విద్యార్థులు US విద్యాసంస్థల్లో చదువుతున్నారు, అంతకుముందు సంవత్సరం ఈ సంఖ్య 2,68,923గా ఉంది. 2023-24లో USలో 2,77,398 మంది చైనీస్ విద్యార్థులు ఉన్నారని, 2022-23లో 2,89,526 ఉన్నట్లు నివేదిక తెలిపింది.
F1 వీసా అంటే ఏమిటి..?
F-1 వీసా అనేది నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ విద్యార్థులను యునైటెడ్ స్టేట్స్‌లో పూర్తి సమయం చదువుకోవడానికి అనుమతిస్తుంది. USలోని ఇతర దేశాల విద్యార్థులకు ఇది అత్యంత సాధారణ వీసా.
తాజావార్తలు
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
-
Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
-
Gold – Silver Prices: రూ. 8 వేలు తగ్గిన వెండి.. బంగారం ఎంత పతనం అయ్యిందంటే!
-
OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
-
ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..