US F-1 Visas: అమెరికాలో చదువుకోవాలనేది భారతీయ విద్యార్థుల కల. స్టూడెంట్స్ మాత్రమే కాదు వారి తల్లిదండ్రులు కూడా మా అబ్బాయి అమెరికాలో చదువుకుంటున్నాడని గొప్పగా చెబుతూ మురిసిపోతుంటారు. అయితే, 2024 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు భారతీయ విద్యార్థుల వీసాలు భారీగా తగ్గినట్లు యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. యూఎస్ F-1 వీసాలలో 38 శాతం తగ్గినట్లు చెప్పింది. అయినప్పటికీ, అమెరికా వెళ్లే విదేశీ విద్యార్థుల్లో భారతీయులే టాప్ ప్లేస్‌లో ఉన్నారు.