అమెరికా ప్రభుత్వం ఇటీవల విదేశీ విద్యార్థులపై చర్య తీసుకుంది. స్టూడెంట్ వీసా హోల్డర్లను గుర్తించి, పరిశీలించడానికి “క్యాచ్ అండ్ రివోవల్” కార్యక్రమాన్ని విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ప్రకటించారు. ఇందులో యూదు వ్యతిరేకత లేదా పాలస్తీనియన్లు, హమాస్‌కు మద్దతు ఇచ్చే ఆధారాల కోసం వారి సోషల్ మీడియాను పర్యవేక్షించడం కూడా ఉంది. ఈ చర్య తర్వాత, చాలా మంది అంతర్జాతీయ విద్యార్థుల వీసాలు రద్దయ్యాయి. వారిలో ఎక్కువ మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. అమెరికన్ లాయర్స్ అసోసియేషన్…
US F-1 Visas: అమెరికాలో చదువుకోవాలనేది భారతీయ విద్యార్థుల కల. స్టూడెంట్స్ మాత్రమే కాదు వారి తల్లిదండ్రులు కూడా మా అబ్బాయి అమెరికాలో చదువుకుంటున్నాడని గొప్పగా చెబుతూ మురిసిపోతుంటారు. అయితే, 2024 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు భారతీయ విద్యార్థుల వీసాలు భారీగా తగ్గినట్లు యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. యూఎస్ F-1 వీసాలలో 38 శాతం తగ్గినట్లు చెప్పింది. అయినప్పటికీ, అమెరికా వెళ్లే విదేశీ విద్యార్థుల్లో భారతీయులే టాప్ ప్లేస్‌లో ఉన్నారు.
అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్. గత సంవత్సరం కంటే ఈసారి రికార్డ్ స్థాయిలో స్టూడెంట్స్ వీసాలని జారీ చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఆ మేరకు ఢిల్లీలోని అమెరికా ఎంబసీ అధికారిని పాట్రిసియా లసినా తెలిపింది. కరోనా సమస్యలు ఉన్నప్పటికీ.. గతేడాదిలో 62 వేల మంది భారతీయ విద్యార్థులకు వీసాలు అందాయి. ఈసారి లక్ష దరఖాస్తుల్ని పరిశీలిస్తున్నామని పాట్రిసియా పేర్కొంది. ‘‘అమెరికా విద్యాసంస్థలకు, సమాజానికి తోడ్పాటునందిస్తున్న అంతర్జాతీయ విద్యార్థులకు.. ముఖ్యంగా భారతీయులకు మా దేశం ఎంతో…