భారత్‌పై దుష్ప్రచారానికి పెద్దపీట వేస్తున్న కొన్ని యూట్యూబ్ ఛానళ్లపై కేంద్రం కొరడా ఝుళిపించింది. భారతదేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న 22 యూట్యూబ్ ఛానెల్‌లను సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ బ్లాక్ చేసింది. ప్రత్యేక ఉత్తర్వుల్లో, సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ 22 ఛానెళ్లపై ఈ చర్యలు తీసుకోవాలని యూట్యూబ్‌ను ఆదేశించింది. భారత్‌పై దుష్ప్రచారం చేస్తున్న 22 యూట్యూబ్ చానళ్లపై ప్రభుత్వం నిషేధం విధించింది. కేంద్రం బ్యాన్ చేసిన వాటిలో 4 పాకిస్థాన్‌కు యూట్యూబ్ చానళ్లు ఉన్నట్లు తెలిపింది.
ఇవి పాకిస్థాన్ వేదికగా పనిచేస్తున్నట్టు గుర్తించారు. నిఘా వర్గాల సహకారంతో సమాచార, ప్రసారశాఖ మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ చానళ్లు దేశ భద్రత, సున్నిత అంశాలపై వ్యతిరేక వార్తలు ప్రసారం చేస్తున్నట్టు కేంద్రం పేర్కొంది. టెలికమ్యూనికేషన్స్ విభాగం, భారత వ్యతిరేక ప్రచారాన్ని ప్రోత్సహిస్తున్న యూట్యూబ్ చానళ్లను బ్లాక్ చేయాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. పలు విషయాలలో ప్రభుత్వ వ్యతిరేక కంటెంట్ పోస్టు చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై మైనారిటీలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి.
https://ntvtelugu.com/drugs-pedler-lakshmipathi-arrest/