సిరియాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను తాము సునిశితంగా గమనిస్తున్నామని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఆ దేశ ఐక్యత, ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు అక్కడి అన్ని పార్టీలు సమష్టిగా కృషి చేయాలన్నారు.
Syria Crisis: మధ్యప్రాచ్యం మరోసారి అట్టుడుకుతోంది. ఇప్పటికే ఇజ్రాయిల్-హమాస్-హిజ్బుల్లా-ఇరాన్ వల్ల ఆ ప్రాంతంలో ఉద్రిక్తత ఏర్పడింది. ఇదిలా ఉంటే, తాజాగా సిరియా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌పై తిరుగుబాటుదారులు పైచేయి సాధించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రాజధాని డమాస్కస్ తర్వాత అతిపెద్ద నగరంగా ఉన్న అలెప్పోపై రెబల్స్ పట్టుసాధించారు. ఇప్పుడు రాజధాని డమాస్కస్ వైపు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే అలెప్పోకి దారి తీసే అన్ని రహదారుల్ని, సమీప ప్రాంతాలన్ని రెబల్స్ ఆక్రమించారు. అల్ ఖైదా…