ప్రస్తుతం టాలీవుడ్ టూ బాలీవుడ్ ఎక్కడ చూసినా మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్‌గా ఉన్న స్టార్స్ అంతా పెళ్లి పీటలెక్కుతున్నారు. గతేడాది చాలా టాలీవుడ్ సెలబ్రెటీలు వైవాహిక జీవితంలో అడుగుపెట్టారు. అయితే తాజాగా అక్కినేని హీరో విషయంలో ఓ గాసిప్ వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..తన చివరి శ్వాస వరకు నటించారు నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు. ఇక ఇప్పుడు ఆయన కుటుంబం నుంచి ఇండస్ట్రీలో మూడు తరాలుగా హీరోలుగా చలమని అవుతున్నారు.
Also Read: Sonu Nigam : నోరుజారిన సింగర్ సోను నిగమ్.. మండి పడుతున్న కన్నడ ప్రజలు
అయితే నాగేశ్వరరావు కు ఐదుగురు పిల్లలు.. వెంకట్, సత్యవతి, నాగ సుశీల, నాగ సరోజ, నాగార్జున. వీరిలో నాగార్జున, వెంకట్, నాగసుశీల పేర్లు అందరికీ తెలిసిందే. అక్కినేని నట వారసుడిగా నాగార్జున హీరోగా తండ్రి పేరు నిలబెట్టగా.. వెంకట్ వ్యాపారాలు, సినీ నిర్మాణం చూసుకుంటున్నారు. నాగ సుశీల కూడా కొన్ని చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. అక్కినేని కుటుంబం నుంచి మూడో తరం వారసుడిగా ఎంట్రీ ఇచ్చారు సుమంత్, సుప్రియ, నాగచైతన్య, సుశాంత్, అఖిల్. ఇందులో చై గురించి మనకు తెలిసిందే. ఇక సుమంత్ గురించి మాట్లాడుకుంటే బారీ హిట్స్ అందుకో నప్పటికి హీరోగా మంచి గుర్తింపు మాత్రం సంపాదించుకున్నాడు. అయితే తాజాగా సుమంత్ పెళ్లి గురించి ఓ వార్త వైరల్ అవుతుంది.
Also Read: Nani: ది ప్యారడైజ్‌లోకి అడుగు పెట్టేది అప్పుడే!
ముందుగా హీరోయిన్ కీర్తి రెడ్డి తో ప్రేమలో పడ్డ సుమంత్ పెద్దల అంగీకారంతో ఆమెను 2004లో పెళ్లాడారు. కొన్నాళ్లు సాఫీగానే సాగినప్పటికీ తర్వాత వీరి బంధం బీటలు వారింది. రెండేళ్లు తిరిగేసరికి 2006లో వీరిద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోయారు. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు వీరు అలాగే ఉండిపోయారు, అయితే తాజాగా సుమంత్‌తో సదరు హీరోయిన్ క్లోజ్‌గా ఉంటోందని ప్రస్తుతం వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపొయ్యారు అని గాసిప్స్ వినిపిస్తున్నాయి. అంతే కాదు వీరి ప్రేమ పెళ్లికి అక్కినేని ఫ్యామిలీ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందట త్వరలో వీరు వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారని జోరుగా వార్తలు వస్తున్నాయి.