Shehbaz Sharif: పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అమాయకపు ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ లష్కరేతోయిబాకు చెందిన ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు ప్రటించుకున్నారు. ఈ దాడి వెనక పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐ, లష్కర్ ప్రయేయాన్ని భారత దర్యాప్తు సంస్థలు కనుగొన్నాయి. ఈ నేపథ్యంలో, భారత్ పాకిస్తాన్‌పై భారీ చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే దౌత్య చర్యల్లో భాగంగా సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది.
Read Also: India Pakistan: బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్‌లకు షాక్ ఇచ్చిన భారత్..
పాకిస్తాన్ సెలబ్రిటీలు, క్రికెటర్లు, యాక్టర్లకు చెందిన యూట్యూబ్ ఛానెళ్లు, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లను భారత్ బ్లాక్ చేస్తోంది. ఈ జాబితాలో పాక్ క్రికెటర్లు మమ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజం, మాజీ క్రికెటర్లు షోయబ్ అక్తర్, షాహిద్ అఫ్రీదీ వంటి వారు ఉన్నారు. యాక్టర్ విషయానికి వస్తే మహిరా ఖాన్, హనియా అమీర్, ఫజల్ అలీతో సహా అనేక మంది నటుల సోషల్ మీడియా ఖాతాలు నిషేధించబడ్డాయి.
తాజాగా, మరో భారీ షాక్ ఇచ్చింది భారత్. పాకిస్తాన్ ప్రధాని షెహజాబ్ షరీఫ్ యూట్యూబ్ ఛానెల్‌ని కేంద్రం సస్పెండ్ చేసింది. ఇదే కాకుండా, భారత్ వ్యతిరేకంగా, పాకిస్తాన్‌కి అనుకూలంగా కథనాలను రూపొందిస్తున్న 16 పాకిస్థానీ యూట్యూబ్ ఛానెళ్లను భారత్ బ్లాక్ చేసింది. వీటన్నింటికి కలిసి 63 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు. వీటిలో డాన్, జియో న్యూస్, బోల్ న్యూస్, సమా టీవీ వంటి మీడియా సంస్థలు, జర్నలిస్ట్ అస్మాషిరాజీ వంటి యూట్యూబ్ ఛానెళ్లు ఉన్నాయి.