PM Modi: పహల్గామ్ ఉగ్రవాద దాడికి కౌంటర్‌గా భారత చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌పై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈరోజు (మే 25) మన్ కీ బాత్ 122వ ఎపిసోడ్‌లో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ సింధూర్ ప్రతి భారతీయుడు గర్వపడేలా చేసిందని తెలిపారు. ఉగ్రవాదానికి ఈరోజు దేశం మొత్తం వ్యతిరేకంగా నిలిచింది అన్నారు. ఆపరేషన్ సింధూర్ టైంలో భారత సైన్యం ప్రదర్శించిన పరాక్రమం ప్రతి భారతీయుడిని గర్వించేలా చేసిందని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు.
Read Also: Pakistan: రుణం కోసం మళ్లీ ఐఎంఎఫ్కు పాకిస్తాన్.. ఈసారి ఏకంగా..!
ఇక, వరల్డ్ వైడ్ గా ఉగ్రవాదంపై పోరాటానికి ఆపరేషన్ సింధూర్ సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది అని ప్రధాన మంత్రి మోడీ తెలిపారు. ఆపరేషన్ సింధూర్ దేశ ప్రజలను ఎంతగా ప్రభావితం చేసిందంటే.. ఎన్నో కుటుంబాలు దీనిని తమ జీవితాల్లో భాగం చేసుకున్నాయని చెప్పుకొచ్చారు. యావత్ భారతదేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాటం చేస్తుందన్నారు. ప్రతి భారతీయుడి సంకల్పం ఉగ్రవాదాన్ని నిర్మూలించడమే.. సరిహద్దు వెంట ఉన్న ఉగ్రవాద స్థావరాలను ఇండియన్ ఆర్మీ నాశనం చేసిందని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.
Read Also: Simbu : నాతో వర్క్ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు..
అయితే, ఆపరేషన్ సింధూర్ కేవలం సైనిక లక్ష్యం కాదని ప్రధాని మోడీ చెప్పారు. ఇది మన సంకల్పం, ధైర్యానికి నిదర్శనం అన్నారు. ఇక, అభివృద్ధిలో దూసుకుపోతున్న జమ్మూ కాశ్మీర్‌ను ఉగ్రవాదులు మళ్ళీ నాశనం చేయాలని చూస్తున్నారు.. అందులో భాగంగానే పర్యటక ప్రాంతమైన పహల్గాంలో ఉగ్రదాడికి దిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టెర్రరిస్టులపై పోరులో 140 కోట్ల మంది భారతీయుల సంఘీభావం దేశానికి గొప్ప బలమని ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు.