US-India-Russia: చమురు విషయంలో రష్యా హామీ.. అమెరికా ముందు భారత్ కీలక డిమాండ్..
- ఇంధన భద్రతకు భారత్‌కు రష్యా భరోసా..
- మినహాయింపు ఇవ్వాలని యూఎస్‌ను కోరిన భారత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US-India-Russia: ఇరాన్ వార్, హార్ముజ్ సంక్షోభం నేపథ్యంలో భారత్ తీవ్ర చమురు సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో భారత ఇంధన భద్రతకు హామీ ఇస్తూ, గ్యాస్, చమురు సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు రష్యా ప్రకటించింది. ఈ నేపథ్యంలో రష్యా చమురు కొనుగోళ్లపై మినహాయింపు ఇవ్వాలని అమెరికాను భారత్ కోరినట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంధన సరఫరా కొనసాగించడం అత్యంత కీలకమైని, చమురు మార్కెట్లో అస్థిరత కొనసాగితే ఇది భారత ఆర్థిక వ్యవస్థ, ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుందని భారత్, అమెరికాకు తెలిపింది.
ఇరాన్ యుద్ధం తర్వాత, భారత్‌తో సహా ఇతర దేశాలు రష్యా చమురు కొనుగోలు చేసేందుకు మార్చిలో అమెరికా అనుమతినిచ్చింది. ఈ మినహాయింపును మే 16 వరకు పొడిగించారు. ఈ మినహాయింపుల వల్ల భారత్ రష్యా నుంచి ముడి చమురును రాయితీపై కొనుగోలు చేసింది. అయితే, ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాపై ఒత్తిడి తీసుకురావడానికి భారత్ రష్యా చమురు కొనుగోలు చేయొద్దని అమెరికా ఒత్తిడి తెస్తోంది. ఇప్పుడు ఇరాన్ యుద్ధం కారణంగా, చమురు కష్టాలు మరింత ఎక్కువయ్యాయి.
Also Read
Read Also: Emmanuel Macron: నటి మెసేజ్‌లే కారణమా..? ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్‌కు భార్య చెంపదెబ్బ!
ఎకనామిక్స్ టైమ్స్ నివేదిక ప్రకారం.. చమురు మార్కెట్లలో అస్థిరత, సంక్షోభం కొనసాగితే ఇది సామాజిక ఆర్థిక పరిణామాలకు దారితీయెచ్చని భారత అధికారులు అమెరికాకు తెలిపారు. ఈ విషయంపై భారత విదేశాంగ శాఖ, చమురు మంత్రిత్వ శాఖలు స్పందించలేదు. అటు అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ నుంచి కూడా అధికారిక స్పందన రాలేదు.
మరోవైపు, న్యూఢిల్లీలో బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశానికి రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ వచ్చే ముందు కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ఇంధన ప్రయోజనాలు పూర్తిగా రక్షించబడేలా రష్యా హామీ ఇస్తుందని ఆయన అన్నారు. భారత ప్రయోజనాలకు భంగం కలుగకుండా ఇంధన సరఫరా చేస్తామని అన్నారు. ఇంధన రంగంలో భారత్, ఇతర భాగస్వామ్య దేశాల పట్ల రష్యా తన బాధ్యతను ఎన్నడూ మరిచి లేదని చెప్పారు. భారతదేశానికి మరింత ఇంధనం అవసరమని, రష్యా గ్యాస్, చమురు, బొగ్గు వంటి హైడ్రోకార్బన్లను నిరంతరం సరఫరా చేస్తుంది అని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Taslima Nasrin: 20 ఏళ్ల నిరీక్షణకు ముగింపు.. కోల్‌కతాకు తిరిగి వస్తున్న తస్లీమా
-
CM Chandrababu: ఏపీ పెట్టుబడుల గమ్యస్థానం.. అభివృద్ధిపై సీఎం కీలక వ్యాఖ్యలు
-
Shruti Haasan : సొంతంగా ఇల్లు కొని ఒంటరిగా గృహప్రవేశం చేసిన శృతి హాసన్.. అసలేం జరిగింది?
-
Samay Raina: నటుడు సమయ్ రైనాకు సుప్రీంకోర్టు షాక్.. రూ.10 లక్షల జరిమానా
-
Tollywood Sequels : టాలీవుడ్‌ను ఊపేస్తున్న సీక్వెల్ ఫీవర్.. తారక్, చరణ్, మహేష్’ల నెక్ట్స్ ప్లాన్ ఏంటి?
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!