Modi-Trump: రష్యా చమురుపై మోడీ-ట్రంప్ మధ్య అలాంటి సంభాషణ ఏం జరగలేదు.. ఖండించిన భారత్
- మోడీ-ట్రంప్ మధ్య అలాంటి సంభాషణే జరగలేదు
- రష్యా చమురుపై చేసిన వ్యాఖ్యలను ఖండించిన భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్ నిలిపివేసిందని.. ఈ మేరకు ప్రధాని మోడీ తనకు హామీ ఇచ్చారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. అయితే ట్రంప్ వాదనలను భారత్ ఖండించింది. ఈ విషయంపై ఇరువురు నేతల మధ్య ఎలాంటి ఫోన్ సంభాషణ జరగలేదని తెలిపింది. మోడీ- ట్రంప్ మధ్య ఈ మధ్య కాలంలో ఎలాంటి సంభాషణ జరగలేదని విదేశీ వ్యవహారాలశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ వెల్లడించారు. ఇక ఇదే అంశంపై రష్యా కూడా స్పందించింది. భారత ప్రయోజనాలకు అనుగుణంగానే రెండు దేశాల మధ్య ఇంధన బంధం కొనసాగుతోందని స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Kriti Sanon: తొలి భారతీయ మహిళా నటిగా ‘కృతి సనన్’ చరిత్ర!
Also Read
- Rahul Gandhi: “భయపడొద్దు.. ముస్లింలకు మద్దతుగా నిలవాలి”.. రాహుల్ గాంధీ
- MK Stalin: “విజయ్ ప్రభుత్వం డీఎంకే దయపైనే”.. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
- Ebola outbreak: ఎబోలా అలర్ట్.. 3 ఆఫ్రికా దేశాలకు వెళ్లొద్దన్న భారత్
- IMD Rain Alert: మండే ఎండల్లో వాతావరణ శాఖ కూల్ అప్ డేట్.. వేగం పుంజుకున్న రుతుపవనాలు.. ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
రష్యా దగ్గర పాశ్చాత్య దేశాలు, భారతదేశం చమురు కొనుగోలు చేయడం వల్ల ఉక్రెయిన్‌పై యుద్ధం ఆగడం లేదని పదే పదే ట్రంప్ ఆరోపించారు. రష్యా ఆర్థికంగా బలపడడం వల్లే ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగిస్తోందని పేర్కొన్నారు. రష్యాతో సంబంధాలు తెంచుకోవాలని.. లేదంటే భారీగా సుంకాలు విధిస్తానని హెచ్చరించారు. అన్నట్టుగానే భారత్‌పై 50 శాతం సుంకం విధించారు. అలాగే చైనాపై 100 శాతం సుంకం విధించారు. అయితే తాజాగా ట్రంప్ మాట్లాడుతూ.. రష్యా దగ్గర చమురు కొనుగోలు నిలిపివేసినట్లు మోడీ తనకు చెప్పారని ట్రంప్ అన్నారు. ఈ వ్యాఖ్యలను భారత్ ఖండించింది.
ఇది కూడా చదవండి: Siddu Jonnalagadda : ఆ హీరోనే నా ఫేవరెట్.. తెలుగు హీరోలకు షాక్ ఇచ్చిన సిద్దు జొన్నలగడ్డ
ఇక ట్రంప్ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ స్పందిస్తూ.. ప్రధాని మోడీ ట్రంప్‌కు భయపడుతున్నారని ఆరోపించారు. భారత్‌కు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని ట్రంప్‌నకు మోడీ ధారాదత్తం చేసినట్టుగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి పియూష్ గోయల్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ‘‘కొన్ని రోజుల క్రితం వాణిజ్య ఒప్పందం ఎందుకు లేదని కాంగ్రెస్ అడగడం నేను విన్నాను. ఇది చుక్కాని లేని, నాయకుడు లేని, దిశానిర్దేశం లేని పార్టీ. కాంగ్రెస్ నిజంగా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే నేడు ప్రతిపక్షాలు కూడా కాంగ్రెస్‌ను తమ నాయకుడిగా చూడటం లేదని, దేశ నాయకత్వాన్ని మర్చిపోతున్నాయని నేను అనుమానిస్తున్నాను.’’ అని గోయల్ అన్నారు.
ఇది కూడా చదవండి: Andhra Pradesh Student Suicides: విద్యార్థుల ఉసురు తీసిన అవమానం..
తాజావార్తలు
-
Rahul Gandhi: “భయపడొద్దు.. ముస్లింలకు మద్దతుగా నిలవాలి”.. రాహుల్ గాంధీ
-
Avika Gor: “ఆయనతో స్క్రీన్ షేర్ చేయడం నా డ్రీమ్”.. నానిపై అవికా గోర్ మనసులో మాట
-
Gurindervir Singh: భారత అత్యంత వేగవంతమైన రన్నర్‌గా గురిందర్‌వీర్ సింగ్ నయా రికార్డు.. 10.09 సెకన్లలో 100 మీటర్లు పూర్తి
-
Pakistan: పాకిస్తాన్లో రక్తపాతం.. జాఫర్ ఎక్స్‌ప్రెస్‌పై బీఎల్ఏ దాడి.. 23 మంది దుర్మరణం
-
Peddi: రామ్ చరణ్ ‘పెద్ది’ .. ‘హెల్లాళ్లాలో’ వీడియో సాంగ్ అవుట్!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?