Sonam Wangchuk: ‘నేను ఇంకా బ్రతికే ఉన్నాను’.. ఆస్పత్రి బెడ్‌పై నుంచి సోనమ్ వాంగ్‌చుక్ భావోద్వేగ సందేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sonam Wangchuk: తన ఆమరణ నిరాహార దీక్ష 25వ రోజుకు చేరుకున్న వేళ.. గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రి బెడ్ పైనుంచే ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. “నేను ఇంకా బ్రతికే ఉన్నాను” (అభీ భీ జిందా హూన్) అంటూ ప్రారంభమైన ఆ ఆరు నిమిషాల వీడియోలో ఆయన తన ఆరోగ్య పరిస్థితిని, ఉద్యమ భవిష్యత్తును వివరించారు. దీక్ష కారణంగా తాను సుమారు 11 కిలోల బరువు తగ్గడమే కాకుండా కండరాల క్షీణతను ఎదుర్కొంటున్నప్పటికీ, ప్రస్తుతం తన ఆరోగ్యం కుదుటపడిందని తెలిపారు. వైద్యుల పర్యవేక్షణ కోసం మంగళవారం రాత్రి తనను ఆసుపత్రిలో చేర్చినట్లు పేర్కొన్నారు. సోమవారం నాటి ‘ఛలో సంసద్’ మార్చ్‌లో పాల్గొన్న విద్యార్థుల తీరును వాంగ్‌చుక్ కొనియాడారు. పోలీసులు లాఠీఛార్జ్ చేసినప్పటికీ విద్యార్థులు ఎంతో ఓర్పుతో, శాంతియుతంగా నిరసన తెలపడం తనను ఎంతగానో కదిలించిందని, వారి నిగ్రహమే తన దీక్షను కొనసాగించేలా సంకల్పాన్ని మరింత బలపరిచిందని వ్యాఖ్యానించారు.
“లాఠీ దెబ్బలు తిన్నా కూడా ఎదురుదాడికి దిగకుండా మిక్కిలి ఓపికను ప్రదర్శించిన విద్యార్థులందరికీ నేను సెల్యూట్ చేస్తున్నాను. వారిపై జరిగిన దమనకాండను చూశాకే నేను దీక్షను కొనసాగించాలని నిర్ణయించుకున్నాను” అని స్పష్టం చేశారు. అయితే, విద్యార్థులపై ఎలాంటి పోలీసు చర్యలు, ఎఫ్ఐఆర్లు, అరెస్టులు లేదా వేధింపులు ఉండవని ప్రభుత్వం హామీ ఇస్తే తాను వెంటనే దీక్ష విరమించేందుకు సిద్ధంగా ఉన్నానని వాంగ్‌చుక్ స్పష్టం చేశారు. “కేంద్ర మంత్రులతో సహా అధికార పార్టీకి చెందిన పలువురు నాయకులు దీక్ష విరమించాలని నన్ను కోరారు. నా పని నాకు చాలా ముఖ్యమైనది కాబట్టి నేను కూడా దీక్షను ముగించాలనుకుంటున్నాను. కానీ విద్యార్థులపై బలప్రయోగాన్ని నిలిపివేసి, వారిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోమని ప్రభుత్వం హామీ ఇవ్వాలి. ఆ హామీ ఇప్పుడే లభిస్తే, నేను ఈరోజే నిరాహార దీక్షను విరమిస్తాను. లేకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో దీక్షను కొనసాగించాల్సి వస్తుంది” అని ఆయన పేర్కొన్నారు. దీనికి ముందు, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లకు రాసిన లేఖను కూడా వాంగ్‌చుక్ విడుదల చేశారు. ఆస్పత్రికి వచ్చి తన ఆరోగ్యం గురించి విచారించి, దీక్ష విరమించాలని కోరినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. తాను తిరిగి తన పనిలోకి వెళ్లాలనుకుంటున్నానని, అయితే ఆందోళనలో పాల్గొన్న యువతపై ఎలాంటి కక్షసాధింపు చర్యలు ఉండవని ప్రభుత్వం స్పష్టత ఇచ్చేంతవరకు అది సాధ్యపడదని లేఖలో స్పష్టం చేశారు. జవాబుదారీతనం ఉన్న విద్యావ్యవస్థ కోసం గొంతుత్తడమే ఆ విద్యార్థులు చేసిన ఏకైక ‘నేరం’ అని, కాబట్టి వారిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోకూడదని ఆయన కోరారు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన సుమారు 65 మంది ఎంపీలు నేరుగా కలసి లేదా లేఖల ద్వారా తనను పరామర్శించి దీక్ష విరమించాలని కోరినట్లు వాంగ్‌చుక్ తెలిపారు.
Also Read
- CM Chandrababu Prakasam District Visit: నేడు ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన..
- Astrology: అక్టోబర్ 09 శుక్రవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లిస్తే అంతా శుభమే..!
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
తాజావార్తలు
-
CM Chandrababu Prakasam District Visit: నేడు ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన..
-
GST Council Big Decision: జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం.. అరెస్ట్ అధికారాల తొలగింపు, రూ.5 కోట్లకు ప్రాసిక్యూషన్ పరిమితి
-
Astrology: అక్టోబర్ 09 శుక్రవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లిస్తే అంతా శుభమే..!
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!