India: ఖలిస్తానీ టెర్రరిస్టు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై కెనడా చేసిన ఆరోపణల్ని భారత్ తీవ్రంగా తప్పుపట్టింది. కెనడా చేస్తున్న ఆరోపణలు అసబద్ధమైనవి, ప్రేరేమితమని భారత విదేశాంగ శాఖ ఘాటుగానే సమాధానం ఇచ్చింది. భారతదేశానికి చట్టబద్దమైన పాలనపై బలమైన నిబద్ధత ఉందని పేర్కొంది. ‘‘కెనడా పార్లమెంట్ లో ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో, వారి విదేశాంగ మంత్రి చేసిన ప్రకటనను చూశామని, కెనడాలోని ఏదైన హింసాత్మక చర్యలో భారత ప్రభుత్వ ప్రమేయం ఉందనే ఆరోపణలు పూర్తిగా అసంబద్ధమైనవి, ప్రేరేపితమైనవి’’ అని ఒక ప్రకటనలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు.
Read Also: Canada: భారత్‌పై కెనడా ప్రధాని సంచలన ఆరోపణలు.. ఖలిస్తానీ ఉగ్రవాది హత్యకు భారత దౌత్యవేత్త బహిష్కరణ
జూన్ నెలలో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడాలోని సర్రేలో హత్య చేయబడ్డాడు. ఈ హత్యతో భారతీయ ఏజెంట్లకు సంబంధాలు ఉన్నాయని కెనడా ప్రధాని ట్రూడో సోమవారం అక్కడి పార్లమెంట్ లో ఆరోపించారు. అగ్రశ్రేణి భారత దౌత్యవేత్తను బహిష్కరిస్తూ కెనడా నిర్ణయం తీసుకుంది. నిజ్జర్ హత్యకు భారత ప్రభుత్వానికి మధ్య ఉన్న సంబంధాలను కెనడా భద్రతా సంస్థలు పరిశీలిస్తున్నాయని ట్రూడో మంగళవారం తెలిపారు.
అయితే ఈ ఆరోపనల్ని పూర్తిగా ఖండిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. మాది ప్రజాస్వామ్య రాజకీయాలతో కూడిన చట్టబద్ధపాలన అని తెలిపింది. ఖలిస్తానీ చిచ్చు ఇరు దేశాల మధ్య ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి. భారత వ్యతిరేఖ, ఖలిస్తానీ శక్తులపై చర్యలు తీసుకోవాలని పలుమార్లు ఇండియా, కెనడా ప్రభుత్వాన్ని కోరింది. అయితే అక్కడి ప్రభుత్వం మాత్రం రాడికల్ సిక్కులు, వారి సంస్థలపై ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. కెనడాలో సిక్కు వర్గం బలమైన లాబీగా ఉంది. దీంతో ట్రూడో ప్రభుత్వం కూడా అక్కడి వేర్పాటువాదానికి పరోక్షంగా మద్దతు పలుకుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కెనడా, భారత్ తో వాణిజ్య చర్చల్ని వాయిదా వేసింది.