Monsoon Shock: 125 ఏళ్ల తర్వాత ముఖం చాటేసిన వరుణుడు.. ఐదో అత్యంత పొడి జూన్గా రికార్డ్
- 125 ఏళ్ల తర్వాత ముఖం చాటేసిన వరుణుడు
- ఐదో అత్యంత పొడి జూన్గా రికార్డ్
- అప్రమత్తంగా ఉండాలని నిపుణుల హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎల్‌నినో ప్రభావమో.. లేదంటే ఇంకేంటో తెలియదు గానీ.. జూన్ నెల వర్షాలు లేకుండానే ముగిసిపోయింది. దేశంలో ఎక్కడ కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. దేశంలోకి రుతుపవనాలు ప్రవేశించి చాలా రోజులైనా.. ఏ రాష్ట్రంలోనూ భారీ వర్షాలు కురవలేదు. ఆశ్చర్యం ఏంటంటే చాలా రాష్ట్రాలకు ఇంకా రుతుపవనాలు కూడా ప్రవేశించలేదు. ఇప్పటికీ దేశమంతా ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎల్‌నినో కారణంగా ఈ ఏడాది వర్షాలు అంతంత మాత్రంగానే ఉంటాయని భారత వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. వార్నింగ్ ఇచ్చినట్లుగానే వరుణుడు ముఖం చాటేశాడు. 1901 తర్వాత ఐదో అత్యంత పొడి జూన్గా రికార్డ్ సృష్టించినట్లుగా అధికారులు తెలిపారు. దీంతో అన్నదాతలకు కన్నీళ్లే మిగిలేటట్టు కనిపిస్తున్నాయి.

Also Read
- Mamata Banerjee: మమతా బెనర్జీపై కత్తితో దాడికి మహిళ యత్నం.?
- Essential Commodity Prices: వంటింట్లో మంటలు.. 42 వస్తువుల్లో 41 ధరలు పెరుగుదల..! నిత్యావసరాల తాజా లెక్కలివే
- L Murugan Resigns: కేంద్ర మంత్రి పదవికి మురుగన్ రాజీనామా.. కారణం ఏంటంటే..
- Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ఆలస్య ప్రవేశం దేశవ్యాప్తంగా వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. 1901 నుంచి వాతావరణ రికార్డులు నమోదు చేస్తున్న చరిత్రలో 2026 జూన్ నెల ఐదో అత్యంత పొడి జూన్గా నమోదైంది. సాధారణ సగటుతో పోలిస్తే జూన్ నెలలో 39.8 శాతం తక్కువ వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ మంగళవారం వెల్లడించింది.
దశాబ్దంలోనే అత్యల్ప వర్షపాతం
గత పదేళ్లలో ఇదే అత్యంత తక్కువ జూన్ వర్షపాతంగా నమోదైంది. సాధారణంగా జూన్ నెలలో దేశవ్యాప్తంగా 165.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వాలి. అయితే ఈసారి కేవలం 99.5 మిల్లీమీటర్ల వర్షమే కురిసిందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణ తేదీతో పోలిస్తే మూడు రోజుల ఆలస్యంగా కేరళలో ప్రవేశించాయి. అనంతరం పశ్చిమ భారతదేశంలోని ప్రధాన వ్యవసాయ ప్రాంతాల వైపు రుతుపవనాల పురోగతి దాదాపు రెండు వారాల పాటు నిలిచిపోవడంతో దేశవ్యాప్తంగా వర్షపాతం తీవ్రంగా తగ్గింది. ఇక వర్షాభావం కారణంగా ఖరీఫ్ పంటల సాగు పనులు మందగించాయి. ముఖ్యంగా వరి, మొక్కజొన్న, పత్తి, సోయాబీన్ వంటి పంటల విత్తనాల విత్తకం ఆలస్యమవుతోంది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మండుతున్న ఎండలు
ఇక వర్షాల లేమితో ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగాయి. కొన్ని రాష్ట్రాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెల్సియస్‌కు పైగా నమోదవుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. భారతదేశంలో ఏడాది మొత్తం కురిసే వర్షాల్లో దాదాపు 70 శాతం వర్షపాతం నైరుతి రుతుపవనాల ద్వారానే లభిస్తుంది. ఈ వర్షాలు దేశంలోని చెరువులు, జలాశయాలు, భూగర్భ జలాలను నింపడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
సుమారు 4 ట్రిలియన్ డాలర్ల భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం ప్రధాన ఆధారంగా ఉండగా.. దేశంలోని దాదాపు సగం వ్యవసాయ భూమికి నీటిపారుదల సౌకర్యం లేదు. అలాగే దేశ జనాభాలో సగానికి పైగా ప్రజలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. దీంతో రుతుపవనాల ఆలస్యం రైతులతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!