CJP Deepfake Case: PM మోదీతో మహిళ మార్ఫ్డ్ ఫొటోలు.. CJP నేతలకు హైకోర్టు నోటీసులు
- పీఎం మోడీతో మహిళ మార్ఫ్డ్ ఫోటోలు..
- సీజేపీ నేతలకు కోర్టు నోటీసులు..
- చిత్రాలను తొలగించాలని మెటాకు ఢిల్లీ హైకోర్టు ఆదేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CJP Deepfake Case: మహిళ ఫోటోను ఏఐ ఉపయోగించి, ఫేస్ స్వాపింగ్ టెక్నాలజీ సాయంతో మార్ఫ్ చేసి, సోషల్ మీడియా ఫ్లాట్ఫారమ్లలో ప్రచారం చేశారనే ఆరోపణలపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ మహిళ అభ్యంతర చిత్రాలను, లింకులను 24 గంటల్లో తొలగించాలని మెటాను ఆదేశించింది. ఇదే కాకుండా మహిళకు పోలీస్ రక్షణ ఇవ్వాలని సూచించింది.
ఈ కేసులో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ప్రధాన నాయకులు సౌరవ్ దాస్, అభిజిత్ దీప్కే, అశుతోష్ రాంకా, రత్న సింగ్‌లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు సీజేపీ నేతల ప్రమేయం ఉందని అనుమానిస్తున్నారు. కోర్టు తన నోటీసుల్లో వారిపై వస్తున్న ఆరోపణలపై స్పందించాలని కోరింది. ఈ కేసుపై ఢిల్లీ పోలీసులు ఇప్పటికే ‘గుర్తుతెలియని వ్యక్తుల’పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే, ఈ కేసులో సీజేపీ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు.
Also Read
- Gyanesh Kumar: ‘జ్ఞానేష్ కుమార్‌కు పద్మభూషణ్ ఇవ్వాలి’.. బెంగాల్ బీజేపీ చీఫ్ వ్యాఖ్యలు
- Pakistan: ‘‘హఫీజ్ సయీద్‌ను ఎప్పుడు విచారిస్తారు?’’.. పాకిస్తాన్ ప్రధాని మౌనం..
- ECI: "ఆ వార్త నమ్మొద్దు".. సీఈసీ జ్ఞానేష్ కుమార్ యూపీ పర్యటన రద్దుపై ఈసీఐ క్లారిటీ..
- Banks-Government: బ్యాంక్‌ల డిమాండ్లకు ససేమిరా.. కేంద్రం ఏం చెబుతుందంటే..!
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన సీజేపీ నిరసనల సమయంలో ఒక మహిళ వ్యక్తిగత ఫోటోను అనుమతి లేకుండా ఏఐ ఉపయోగించి, ప్రధాని నరేంద్రమోడీతో కలిసి ఉన్నట్లుగా అభ్యంతరకర చిత్రాన్ని ప్రచారం చేశారు. దీనిపై సదరు మహిళ కోర్టును ఆశ్రయించారు. ఈ చిత్రాలను సోషల్ మీడియా, ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రచారం చేయడంతో పాటు, నిరసనల స్థలంలో బ్యానర్లు, పోస్టర్లపై కూడా ప్రదర్శించారని ఆమె తన పిటిషన్లో పేర్కొన్నారు. దీని తర్వాత తనకు బెదిరింపులు వచ్చాయని, తనకు రక్షణ కల్పించాలని కోర్టును కోరింది. ఈ నేపథ్యంలో మహిళకు రక్షణ ఇవ్వడంతో పాటు, చిత్రాలను 24 గంటల్లో తొలగించాలని మెటాను కోర్టు ఆదేశించింది. ఢిల్లీ పోలీసులకు నోటీసులు ఇచ్చి రెండు వారాల్లో స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని కోర్టు కోరింది.
తాజావార్తలు
-
CJP Deepfake Case: PM మోదీతో మహిళ మార్ఫ్డ్ ఫొటోలు.. CJP నేతలకు హైకోర్టు నోటీసులు
-
Trump-Jinping: ట్రంప్ విందుకు అందరూ వచ్చారు.. అసలైనోడే డుమ్మా కొట్టాడు.. ఎవరా ముఖ్యుడు!
-
CM Revanth Reddy : సీఎం రేవంత్‌కు కేరళలో ఘన గౌరవం.. ‘బెస్ట్ పబ్లిక్ సర్వెంట్’ అవార్డు.!
-
Kaaka Update: సంక్రాంతి బరి నుంచి తగ్గేదేలే.. ‘కాకా’ పనులు షురూ!
-
Gyanesh Kumar: ‘జ్ఞానేష్ కుమార్‌కు పద్మభూషణ్ ఇవ్వాలి’.. బెంగాల్ బీజేపీ చీఫ్ వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!