Melodi: యూఏఈ దుబాయ్ వేదికగా ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పు సదస్సు( COP28)ప్రధాని నరేంద్రమోడీతో పాటు పలు దేశాల ప్రధానులు, అధ్యక్షులు హాజరయ్యారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో ప్రధాని నరేంద్రమోడీ సెల్ఫీ ఇప్పుడు ఇంటర్నెట్‌ని షేక్ చేస్తోంది. జార్జియా మెలోని, ప్రధాని మోడీతో దిగిన సెల్ఫీని ‘మెలోడీ’ హాష్ ట్యాగ్‌తో పోస్ట్ చేశారు. ప్రధాని మోడీన ఈ పోస్టను రీట్వీట్ చేస్తూ..‘‘ స్నేహితులను కలవడం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది’’ అని రాశారు.
PM Modi: కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్-28 వరల్డ్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ యూఏఈకి వెళ్లారు. COP28 సందర్భంగా ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్‌తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఇజ్రాయిల్-హమాస్ యుద్ధ నేపథ్యంలో ప్రధాని భేటీ చర్చనీయాంశం అయింది. హమాస్ యుద్దంలో ప్రభావితమైన ప్రజలకు మానవతా సాయం నిరంతరం అందించాల్సినఅ అవసరాన్ని ప్రధాని మరోసారి పునరుద్ఘాటించారు.
COP28 Dubai: యూఏఈ దుబాయ్ వేదికగా COP28 సదస్సు జరుగుతోంది. ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్రమోడీ కూడా హాజరయ్యారు. ప్రపంచ ఉద్గారాలను తగ్గించడానికి అన్ని దేశాలు కలిసి పనిచేయాలని ప్రధాని మోడీ ప్రపంచదేశాలకు పిలుపునిచ్చారు. ప్రజల సహకారంతో కార్బన్ స్కిన్‌లను రూపొందించడంపై దృష్టి సారిచే ‘‘గ్రీన్ క్రెడిట్’’ స్కీమును ఆయన ప్రకటించారు.
వరల్డ్ క్లైమేట్ యాక్షన్ కీలక శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యేందుకు దుబాయ్‌కు వెళ్లనున్న సందర్భంగా వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో వారికి సహాయపడేందుకు తగిన వాతావరణ ఫైనాన్సింగ్, సాంకేతికత బదిలీతో అభివృద్ధి చెందుతున్న దేశాలకు మద్దతు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ గురువారం పిలుపునిచ్చారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో రేపు (డిసెంబరు 1) ప్రపంచ వాతావరణ సదస్సు జరగనుంది.
Global Warming: భూమి గతంలో ఎన్నడూ లేని విధంగా వేగం వేడెక్కుతోందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇలాగే పెరుగుతూ వెళ్లే వినాశనం తప్పదని హెచ్చరిస్తున్నారు.