కరోనా మహమ్మారి విజృంభణతో విదేశీ ప్రయాణాలు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి… కోవిడ్ కేసులు అదుపులోకి వస్తున్న తరుణంలో.. కొన్ని దేశాలు.. ఆంక్షలను సడలిస్తూ వస్తున్నాయి… విమానాల రాకపోకలపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నాయి.. కానీ, భారతీయ విమానాలపై ఆంక్షలను మరోసారి పొడిగించింది కెనడా ప్రభుత్వం… సెప్టెంబర్ 21 తేదీ వరకు భారత్ విమానాలపై నిషేధాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.. కాగా, డెల్టా వేరియంట్ వెలుగు చూడడంతో ఏప్రిల్ 22న ఇండియా నుంచి నేరుగా వెళ్లే విమానాలపై కెనడా నిషేధం విధించింది..…
కరోనా మొదలైనప్పటి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులకు బ్రేక్ పడింది.. అయితే, అవసరాలను అనుగుణంగా కొన్ని ప్రత్యేక విమానాలు, కార్గో విమానాలను నడుపుతూ వచ్చినా.. అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధం కొనసాగుతూనే ఉంది.. ఇక, ప్రస్తుతం సెకండ్ వేవ్ అల్లకల్లోలం సృష్టిస్తోన్న తరుణంలో.. విమానాలపై నిషేధాన్ని మే 31 వరకు పొడిగించింది కేంద్రం. అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై నిషేధానికి సంబంధించి గతంలో జారీ చేసిన ఉత్తర్వుల చెల్లుబాటును మే 31వ తేదీ అర్థరాత్రి వరకు పొడిగిస్తున్నట్లు డైరెక్టరేట్…