వ్యాక్సినేషన్లో మరో మైలురాయిని దాటిన భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్‌లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న వేళ… వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మరో మైలురాయిని చేరింది. తొలి, రెండో డోసు కలిపి 150 కోట్ల మైలురాయిని అధిగమించింది. దీనిపై స్పందించిన ప్రధాని మోదీ.. ‘కొత్త ఏడాదిలో ఈ రికార్డు సాధించడం ఆనందంగా ఉంది. వ్యాక్సిన్ రూపొందించిన శాస్త్రవేత్తలు, కంపెనీలు, హెల్త్ కేర్ ఉద్యోగులకు ధన్యవాదాలు. ప్రతి ఒక్కరి కష్టంతో ఈ మైలురాయిని సాధించాం. సున్నా నుంచి ఈ స్థాయికి వచ్చాం. ఇది దేశం ఘనత. దేశవ్యాప్తంగా 18 ఏళ్లు దాటిన వారు ఇప్పటికే 90 శాతానికి పైగా తొలి డోస్ వ్యాక్సిన్ అందుకున్నారు. తొలి ఐదురోజుల్లో 15-18 ఏళ్ల టీనేజర్లు కూడా 1.5 కోట్ల మందికి పైగా తొలి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు’ అంటూ ట్వీట్ చేశారు.
Read Also: తగ్గేదేలే అంటున్న ఒమిక్రాన్… దేశంలో 3వేలు దాటిన కేసులు
Also Read
కాగా దేశంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు 100 శాతం మొదటి డోస్ వ్యాక్సిన్ పూర్తి చేశాయి. కొన్ని రాష్ట్రాలలో 80 శాతం రెండో డోస్ వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తయింది. తెలంగాణలో ఇప్పటివరకు 70 శాతానికి పైగా రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు ఇటీవల కేంద్ర ప్రభుత్వం 15-18 ఏళ్ల టీనేజర్లకు వ్యాక్సిన్ ప్రక్రియను ప్రారంభించింది. ఇప్పటివరకు కోటిమందికిపైగా టీనేజర్లు తొలి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
आज भारत की वयस्क जनसंख्या में से 90 प्रतिशत से ज्यादा लोगों को वैक्सीन की एक डोज लग चुकी है।
सिर्फ 5 दिन के भीतर ही डेढ़ करोड़ से ज्यादा बच्चों को भी वैक्सीन की डोज लगाई जा चुकी है।
ये उपलब्धि पूरे देश की है, हर सरकार की है: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 7, 2022
తాజావార్తలు
-
YS Jagan: డీఎస్సీపై సీబీఐ విచారణ అంటే ఎందుకంత భయం..? చంద్రబాబును ప్రశ్నించిన జగన్
-
Tarique Rrahman: తారిఖ్ రెహమాన్ అరుదైన రికార్డ్.. యూఎన్‌లో మూడో తరం నేతగా ప్రసంగం
-
Mandadi: కమెడియన్ అనుకుంటే స్టార్ హీరోల కటౌట్లే షేక్ చేశాడు! రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘మండాడి’..
-
AP JUDA: స్టైపెండ్ పెంపుపై జూడాల అసంతృప్తి.. ప్రభుత్వానికి కోర్టు ధిక్కరణ నోటీసులు
-
Kartikeya Gummakonda : తన ‘కమ్‌బ్యాక్’ కోసం మెగాఫోన్ పట్టిన ‘ఆర్ఎక్స్ 100’ హీరో..
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!