AP JUDA: స్టైపెండ్ పెంపుపై జూడాల అసంతృప్తి.. ప్రభుత్వానికి కోర్టు ధిక్కరణ నోటీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP JUDA: జూనియర్ డాక్టర్ల స్టైపెండ్ పెంపు అంశం ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వివాదంగా మారింది.. ప్రభుత్వం తాజాగా జారీ చేసిన జీవో ఎంఎస్ నం.141లో ప్రకటించిన స్టైపెండ్ సవరణను ఏపీ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (APJUDA) వ్యతిరేకించింది. తమతో తుది శాతం, షరతులపై పరస్పర అంగీకారం కుదరకముందే ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు జారీ చేసిందని APJUDA పేర్కొంది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, 2026 జనవరి 1 నుంచి ప్రభుత్వ వైద్య, దంత వైద్య కళాశాలల్లోని ఇంటర్న్‌లకు ప్రస్తుత స్టైపెండ్‌పై 10 శాతం, PGలు, సూపర్ స్పెషాలిటీ PGలు, MDS, DNB విద్యార్థులకు 5 శాతం పెంపు వర్తిస్తుంది. అనంతరం 2027 జనవరి 1 నుంచి అన్ని సంబంధిత వర్గాల స్టైపెండ్ రేట్లను ఏటా 3.5 శాతం చొప్పున పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అయితే ఈ సవరణను APJUDA అంగీకరించడం లేదని స్పష్టం చేసింది. ముఖ్యంగా సీనియర్ రెసిడెంట్లు కూడా APJUDAలో అంతర్భాగమని, వారి సమస్యలను గతంలోనే ప్రభుత్వానికి చేసిన ప్రతినిధిత్వాల్లో స్పష్టంగా ప్రస్తావించామని తెలిపింది. తాజా స్టైపెండ్ సవరణలో సీనియర్ రెసిడెంట్లను చేర్చలేదని అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వం ప్రస్తుత ఉత్తర్వులను పునఃపరిశీలించి, APJUDAతో మరోసారి చర్చలు జరపాలని జూడాలు కోరుతున్నారు. పరస్పర అంగీకారంతో న్యాయసమ్మతమైన స్టైపెండ్ సవరణను నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం వల్ల తమ సమస్యలు పరిష్కారం కావని స్పష్టం చేశారు.
Also Read
- TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
- YSRCP Candidates List: మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. పూర్తి జాబితా ఇదే!
- AP Alliance Seat Sharing: టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ చేసే స్థానాలపై క్లారిటీ.. అధికారిక ప్రకటన ఎప్పుడంటే?
- AP Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. 4 రోజుల పాటు వర్షాలు.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
హైకోర్టు ఆదేశాల అమలుపై కోర్టు ధిక్కరణ నోటీసులు
ఇదిలా ఉండగా, తమ స్టైపెండ్‌కు సంబంధించిన అంశంలో ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలను అమలు చేయలేదంటూ APJUDA ప్రభుత్వానికి లీగల్ నోటీసులు జారీ చేసింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించకపోతే కోర్టు ధిక్కరణ చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని నోటీసులో పేర్కొంది. PIL No.193/2026లో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోతే తిరిగి హైకోర్టును ఆశ్రయిస్తామని APJUDA హెచ్చరించింది. ప్రభుత్వం వెంటనే స్పందించాలని, ఈ నోటీసును తుది నోటీసుగా పరిగణించాలని అసోసియేషన్ పేర్కొన్నట్లు తెలిపింది.
జీవో 141లో ప్రభుత్వం ఏం చెప్పింది?
ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం 2026 జనవరి 1 నుంచి ఇంటర్న్‌లకు 10 శాతం, PGలు, సూపర్ స్పెషాలిటీ PGలు, MDS, DNB విద్యార్థులకు 5 శాతం స్టైపెండ్ పెంపు అమలు చేయనున్నారు. 2027 జనవరి 1 నుంచి ఈ వర్గాలన్నింటికీ ఏటా 3.5 శాతం చొప్పున పెంపు కొనసాగించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ప్రతిపాదన వల్ల ప్రస్తుతం స్టైపెండ్ల కోసం చేస్తున్న ఖర్చుకు అదనంగా ప్రభుత్వంపై సంవత్సరానికి సుమారు రూ.34.08 కోట్ల అదనపు ఆర్థిక భారం పడుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు సమాచారం. 2027 నుంచి ఏటా 3.5 శాతం పెంపు కొనసాగుతుందని ప్రభుత్వం పేర్కొంది. అయితే ప్రభుత్వం ప్రకటించిన ఈ సవరణపై APJUDA అసమ్మతి వ్యక్తం చేయడంతో జూడాల స్టైపెండ్ అంశం మరోసారి వివాదంగా మారింది. ప్రభుత్వం తమతో చర్చించి, సీనియర్ రెసిడెంట్లను కూడా పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది ఏపీ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (APJUDA)..
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!