Mandadi: కమెడియన్ అనుకుంటే స్టార్ హీరోల కటౌట్లే షేక్ చేశాడు! రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘మండాడి’..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mandadi: ఇండియన్ సినీ పరిశ్రమలో ఇప్పటి వరకు ఎందరో మంది కమెడియన్స్ హీరోలుగా అవతారమెత్తారు. కానీ బాక్సాఫీస్ వద్ద తిరుగులేని మాస్ హీరోలకు మాత్రమే సాధ్యమయ్యే రూ.100 కోట్ల క్లబ్‌ను తాకడం వారిలో ఏ ఒక్కరికీ కూడా సాధ్యం కాలేదు. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ, భారతీయ సినిమా చరిత్రలోనే కనీవినీ ఎరుగని సరికొత్త చరిత్రను లిఖించారు తమిళ నటుడు సూరి. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘మండాడి’ ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల సునామీ సృష్టిస్తూ అధికారికంగా రూ.100 కోట్ల మార్కును దాటేసింది. సెప్టెంబర్ 10న థియేటర్లలోకి వచ్చిన ‘మందాడి’ స్టార్టింగ్ నుంచే పాజిటివ్ టాక్‌తో థియేటర్స్‌లో దూసుకుపోతోంది. మత్స్యకారుల సంప్రదాయ బోట్ రేసింగ్ (పడవల పోటీల) నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఇతర భారీ చిత్రాల నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ, ఏమాత్రం తగ్గకుండా కేవలం 11 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.103 కోట్ల నుంచి రూ.104 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
ఒక కమెడియన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా భారత సినీ చరిత్రలోనే తొలిసారిగా వంద కోట్ల మైలురాయిని అందుకోవడంతో ట్రేడ్ వర్గాలు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. రొటీన్ మాస్ మసాలా ఫార్ములాకు భిన్నంగా, గ్రామీణ మత్స్యకారుల జీవన విధానం, ఉద్వేగభరితమైన పడవల పోటీల కాన్సెప్ట్‌ను డైరెక్టర్ మతిమారన్ పుగళేంది అత్యంత ప్రతిభావంతంగా వెండి తెరపై ఆవిష్కరించారు. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన నేపథ్య సంగీతం, భావోద్వేగ సన్నివేశాలు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. సూరి తనదైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. ఈ అరుదైన విజయంపై సూరి స్పందిస్తూ.. ఈ ఘనతకు కారణమైన ప్రేక్షక దేవుళ్లకు, దర్శకుడు మతిమారన్, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్‌లతో పాటు చిత్ర యూనిట్ మొత్తానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం రెండో వారంలోనూ హౌస్‌ఫుల్ బోర్డులతో దూసుకుపోతున్న ‘మండాడి’ వసూళ్ల జోరు చూస్తుంటే, రాబోయే రోజుల్లో ఈ గ్రాఫ్ మరింత పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కంటెంట్ బలంగా ఉంటే ఒకప్పటి కమెడియన్ అయినా బాక్సాఫీస్‌ను ఏలగలడని సూరి ఈ సినిమాతో నిరూపించి చూపించారు.
Also Read
உங்கள் பேரன்பால்… #Mandaadi 100+ கோடி! ❤️🙏
இந்த வெற்றி முழுக்க முழுக்க உங்களுடையது.
கோடி நன்றிகள்!Thank you all 💪🤝🙏😍❤️@rsinfotainment @elredkumar sir #Mani #Sathyaraj sir @MathiMaaran #Suhass @gvprakash @Mahima_Nambiar @Bala_actor & Mandaadi team Love you all ❤️🙏💪💐 pic.twitter.com/2yMPGb2DOP
— Actor Soori (@sooriofficial) September 21, 2026
తాజావార్తలు
-
Cyberabad Traffic Plan: ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌కు చెక్.. సైబరాబాద్ పోలీసుల కొత్త ప్లాన్
-
MEA: పశ్చిమాసియా ఘర్షణల్లో 22 మంది భారతీయులు మృతి..
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
School Holiday in AP: ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు.. ఏపీలో రేపు కూడా 9 జిల్లాల్లో స్కూళ్లకు సెలవు!
-
Minor Girl Abused: మైనర్ బాలికపై ఏళ్ల తరబడి అఘాయిత్యం: తల్లి సహా నలుగురి అరెస్ట్
ట్రెండింగ్
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..