Kartikeya Gummakonda : తన ‘కమ్‌బ్యాక్’ కోసం మెగాఫోన్ పట్టిన ‘ఆర్ఎక్స్ 100’ హీరో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కార్తికేయ గుమ్మకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. డెబ్యూ మూవీ ‘ఆర్ఎక్స్ 100’తో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయి సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ కుర్ర హీరో.. ఆ తర్వాత ‘నానీస్ గ్యాంగ్ లీడర్’, కోలీవుడ్ స్టార్ అజిత్ ‘వలిమై’ సినిమాల్లో విలన్‌గా తనలోని క్రూరత్వాన్ని చూపించి మెప్పించాడు. అయితే, గత రెండేళ్లుగా వెండితెరకు దూరమైన కార్తికేయ.. ఇప్పుడు ఓ సంచలన నిర్ణయంతో టాలీవుడ్ వర్గాలను తీవ్రంగా ఆశ్చర్యపరిచాడు. కేవలం హీరోగానే కాకుండా, ఏకంగా మెగాఫోన్ పట్టి దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కార్తికేయ చేస్తున్న కొత్త సినిమా టైటిల్ ‘కమ్‌బ్యాక్’ (COMEBACK). విశేషం ఏంటంటే.. ఈ చిత్రానికి కార్తికేయనే స్వయంగా కథ సమకూర్చుకుని, దర్శకత్వం వహిస్తూ హీరోగా నటిస్తున్నాడు. శనివారం (సెప్టెంబర్ 21) తన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ఈ గ్లింప్స్ లోని డైలాగ్స్ ఇప్పుడు నెట్టింట ఆసక్తి రేపుతున్నాయి. “బాక్సింగ్ వరల్డ్‌లో తన పేరు వినిపించి మూడేళ్ళు అవుతోంది.. మూడేళ్ళ నుంచి ఏమైపోయాడో తెలియలేదు.. అయినా ఇప్పుడు వచ్చి ఏం చేస్తాడు? ఇట్ ఫీల్స్ లైక్ సూసైడ్ మిషన్ (ఒక విధంగా అది ఆత్మహత్య చేసుకోవడమే)” అంటూ వచ్చే వాయిస్ ఓవర్ సినిమాపై విపరీతమైన క్యూరియాసిటీని పెంచుతోంది. ఇందులో కార్తికేయ ఒక పవర్ఫుల్ బాక్సర్ పాత్రలో కనిపించనున్నాడు. మరో విశేషం ఏంటంటే, తన సొంత బ్యానర్ కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాతో తన సతీమణి లోహితా రెడ్డిని నిర్మాతగా పరిచయం చేస్తున్నాడు కార్తికేయ. సరస్వతి శుక్లా సమర్పిస్తున్న ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్‌గా సూర్య ఆకెళ్ల వ్యవహరిస్తుండగా.. ‘బేబీ’ ఫేమ్ విజయ్ బుల్గానిన్ అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) అందించాడు. గ్లింప్స్‌లో కార్తికేయ స్కిప్పింగ్, బాక్సింగ్ చేస్తూ తన సిక్స్ ప్యాక్ బాడీతో సూపర్ ఫిట్ అండ్ హ్యాండ్సమ్ లుక్‌లో అదరగొట్టాడు. జగదీశ్ చీకటి విజువల్స్ గ్రిప్పింగ్ గా ఉన్నాయి. ఒక పక్క హీరోగా నటిస్తూ, మరోపక్క దర్శకత్వ బాధ్యతలు మోయడం, పైగా నిర్మాణ వ్యవహారాలు చూసుకోవడం అంటే మామూలు రిస్క్ కాదు. అందులోనూ రెండేళ్ల గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఇది కార్తికేయ కెరీర్‌కు అత్యంత కీలకం కానుంది. తన స్వీయ దర్శకత్వంలో వస్తున్న ఈ ‘కమ్‌బ్యాక్’ సినిమాతో ఈ యంగ్ హీరో నిజంగానే సాలిడ్ కమ్‌బ్యాక్ ఇస్తాడో లేక టీజర్ లో చెప్పినట్లు సూసైడ్ మిషన్ అవుతుందో చూడాలి!
Also Read
- Box Office War: టాలీవుడ్లోనే అనుకుంటే.. కోలీవుడ్‌లో మరింత హెవీ కాంపిటీషన్!
- Ramayana Part 1 Advance Booking: రిలీజ్‌కు 11 రోజుల ముందే రూ.20 కోట్ల కలెక్షన్స్..
- Kayadu Lohar: ఆషికా, ఆండ్రియా కాదు.. 'తలా' సరసన కయాదు లోహర్!
- Ramayana Song: "కాపీ కొట్టేశాడా..?".. రామాయణం సాంగ్‌లో ఏఆర్ రెహమాన్ ట్యూన్‌పై నెటిజన్ల ఫైర్..
తాజావార్తలు
-
IND vs NZ 3rd T20: వైభవ్ సూర్యవంశీకి మరో ఛాన్స్.. కానీ మూడో టీ20లో కొత్త ట్విస్ట్!
-
Instagram Reels on TV: ఇన్స్టాగ్రామ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. ఇకపై మొబైల్ స్క్రీన్ కాదు.. నేరుగా టీవీలోనే రీల్స్..
-
దొంగచాటుగా ఓటర్ల డేటాను యాక్సెస్ చేసిన Anthropic Claude AI.. ప్రభుత్వ డేటాబేస్‌ల భద్రతపై కొత్త ప్రశ్నలు..
-
ZP Chairman Election: కోనసీమ కూటమిలో కొత్త ట్విస్ట్.. జనసేన అభ్యర్థిగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే కుమార్తె!
-
Software Engineer S*uicide: ‘పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతా’.. ప్రియుడికి వీడియో కాల్ చేసి సాఫ్ట్వేర్ ఇంజినీర్ అర్చన ఆత్మహత్య.!
ట్రెండింగ్
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!
-
Devdutt Padikkal: ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలి.!
-
Char Dham Yatra Closing Dates: చార్ధామ్ వెళ్లే భక్తులకు అలెర్ట్.. ఆ తేదీ నుండే మూతపడనున్న ఆలయాల తలుపులు..!
-
ఇంట్లోనే హోమ్ థియేటర్.. TCL 65 అంగుళాల 4K Google TV పై రూ. 60,000 భారీ డిస్కౌంట్..!