భారత్‌లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న వేళ… వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మరో మైలురాయిని చేరింది. తొలి, రెండో డోసు కలిపి 150 కోట్ల మైలురాయిని అధిగమించింది. దీనిపై స్పందించిన ప్రధాని మోదీ.. ‘కొత్త ఏడాదిలో ఈ రికార్డు సాధించడం ఆనందంగా ఉంది. వ్యాక్సిన్ రూపొందించిన శాస్త్రవేత్తలు, కంపెనీలు, హెల్త్ కేర్ ఉద్యోగులకు ధన్యవాదాలు. ప్రతి ఒక్కరి కష్టంతో ఈ మైలురాయిని సాధించాం. సున్నా నుంచి ఈ స్థాయికి…