ఇండియాలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నా తీవ్రతమాత్రం తగ్గడంలేదు. ఒక్క కేరళరాష్ట్రంలోనే రోజువారీ కేసుల్లో సగానికి పైగా నమోదవుతున్నాయి. తాజాగా ఇండియాలో గడిచిన 24 గంటల్లో 40,134 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,16,95,958కి చేరింది. ఇందులో 3,08,57,467 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 4,13,718 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 422 మంది మృతి చెందారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,24,773కి చేరింది. గడిచిన 24 గంటల్లో 17,06,598 మందికి టీకాలు వేశారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు మొత్తం 47,22,23,639 మందికి టీకాలు వేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది.