వైట్ డ్రెస్ లో ప్రియాంక చోప్రా క్లాసీ లుక్

దేశీ గర్ల్ ప్రియాంక చోప్రా తాజాగా షేర్ చేసిన పిక్స్ లో వైట్ డ్రెస్ లో క్లాసీ లుక్స్ తో ఆకట్టుకుంటోంది. వృత్తిపరంగా యునైటెడ్ కింగ్‌డమ్‌లో తిరుగుతున్న ఆమె ఎప్పటికప్పుడు తన తాజా ఫొటోలతో అభిమానులను ట్రీట్ చేస్తుంది. ఆమె తన తండ్రికి అంకితం చేసిన పచ్చబొట్టు ‘డాడీస్ లిల్ గర్ల్’ అని కూడా ఫోటోలలో కనిపిస్తుంది. ఆమె సొగసైన నెక్‌పీస్, చెవిపోగులు, రింగులతో అద్భుతంగా కన్పిస్తోంది. గజిబిజిగా ఉండే బన్ హెయిర్‌స్టైల్‌తో ఈ దివా తన లుక్ ను కంప్లీట్ చేసింది. “సెల్ఫీ మోడ్” అంటూ ఈ పిక్స్ ను షేర్ చేసింది. ఆమె ఫోటోకు ప్రతిస్పందిస్తూ నిక్ జోనస్ “యు ఆర్ హాట్” అని రాశారు. అతను లవ్‌స్ట్రక్ ఎమోజీని కూడా జోడించాడు.

Read Also : “లక్ష్య” దర్శకుడికి షాక్ ఇచ్చిన నాగశౌర్య

ఇక ప్రియాంక చోప్రా ప్రస్తుతం రాబోయే వెబ్ సిరీస్ ‘సిటాడెల్’ చిత్రీకరణలో బిజీగా ఉంది. లండన్‌లో దీనిని చిత్రీకరిస్తున్నారు. ఇందులో రిచర్డ్ మాడెన్, స్టాన్లీ టుసీ ఉన్నారు. ఆమె మ్యాట్రిక్స్ తదుపరి ఎడిషన్‌తో పాటు ‘టెక్స్ట్ ఫర్ యు’ అనే అమెరికన్ ఫిల్మ్‌లో కూడా కనిపించనుంది. ఇక ప్రియాంక చోప్రా చివరగా రాజకుమార్ రావు, ఆదర్శ్ గౌరవ్ నటించిన ‘ది వైట్ టైగర్’ చిత్రంలో కనిపించింది. అలాగే షోనాలి బోస్ ‘ది స్కై ఈజ్ పింక్’లో కూడా నటించింది. ఇందులో ఫర్హాన్ అక్తర్, జైరా వాసిమ్ నటించారు.

View this post on Instagram

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra)

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-