Covid Vaccination: దేశంలో 86 శాతం మంది పెద్దలకు వ్యాక్సినేషన్ పూర్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా ముందుకు దూసుకెళ్తోంది. దేశంలో ఇప్పటివరకు 86 శాతం మంది పెద్దలకు రెండు డోసుల టీకాలు అందించామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూఖ్ మాండవీయ వెల్లడించారు. అలాగే చిన్నపిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసిందని తెలిపారు. 6 నుంచి 12 ఏళ్ల వారికి కొవాగ్జిన్, 5 నుంచి 12 ఏళ్ల వారికి కార్బెవాక్స్, 12 ఏళ్లు పైబడిన వారికి జై కోవ్ డీ వ్యాక్సిన్ రెండో డోస్‌కు అత్యవసర వినియోగానికి అనుమతులు ఇచ్చినట్లు పేర్కొన్నారు.
ప్రస్తుతం కొవాగ్జిన్ టీకాను దేశంలో 12 ఏళ్ల నుంచి 18 ఏళ్ల పిల్లలకు ఇస్తున్నారు. కార్బెవ్యాక్స్ టీకాను 12 నుంచి 15 ఏళ్ల వారికి ఇస్తున్నారు. తాజాగా ఈ రెండు టీకాలను ఇంకా తక్కువ వయసు ఉన్న పిల్లలకు సైతం ఇచ్చేందుకు కేంద్రం అనుమతులు జారీ చేసింది. కొవాగ్జిన్ టీకాను 2 నుంచి 18 ఏళ్ల పిల్లలపై పరీక్షించి చూసినప్పుడు, పెద్దలతో పోల్చినప్పుడు పిల్లల్లో ఈ టీకా అధిక ప్రభావం చూపించిందని భారత్ బయోటెక్ వెల్లడించింది. గత ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో ఈ పరీక్షలు నిర్వహించి సంబంధిత సమాచారాన్ని సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్‌కు అందించినట్లు తెలిపింది. దీంతో కొవాగ్జిన్ టీకా అత్యంత భద్రత కలిగి ఉందని నిర్ధారణ అయినట్లు పేర్కొంది. ప్రస్తుత అవసరాలకు తగినన్ని టీకా నిల్వలు తమ దగ్గర ఉన్నాయని భారత్ బయోటెక్ వివరించింది.
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
Way to go!
Over 86% of the adult population is now fully vaccinated.
Together, let's defeat #COVID19.
चरैवेति चरैवेति! pic.twitter.com/4ajcEok33Q
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) April 26, 2022
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!