పొరుగు దేశం చైనా తన చేష్టలను వదిలిపెట్టడం లేదు. తూర్పు లడఖ్‌లో చైనా తన ఉనికిని పటిష్టం చేసుకునే పనిలో రోజురోజుకూ బిజీగా ఉంది. తూర్పు లడఖ్‌లోని పాంగాంగ్ సరస్సు పరిసర ప్రాంతాల్లో కూడా చైనా సైన్యం చాలా కాలంగా తవ్వకాలు జరుపుతోంది.
డ్రాగన్ కంట్రీ చైనా మరోసారి దుందుడుకు చర్యకు దిగింది. భారత్ ను కవ్వించే ప్రయత్నం చేసింది. తూర్పు లడఖ్ సెక్టార్ లో ఘర్షణ ప్రాంతం సమీపంలోకి చైనా యుద్ధవిమానం వచ్చింది. ఈ ఘటన గత నెల చివరి వారంలో జరిగింది. జూన్ చివరి వారంలో ఒక రోజు సాయంత్రం 4 గంటలకు చైనా యుద్ధవిమానం వాస్తవ నియంత్రణ రేఖకు దగ్గరగా భారత భూభాగానికి దగ్గర వచ్చిందని తెలుస్తోంది. ఈ ఘటనతో అప్రమత్తం అయిన భారత సైన్యం వెంటనే…
గత ఏడాది కాలంగా తూర్పు లద్ధాఖ్ ప్రాంతంపై చైనా కన్నేసింది. చైనా బోర్డర్లో భారీగా సైనికులను మోహరిస్తూ రావడంతో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. అదే సమయంలో ఇరు దేశాలకు చెందిన సైనికుల మద్య బాహాబాహీలు జరిగాయి. ఈ దాడుల్లో ఇరు దేశాలకు చెందిన సైనికులు మృతి చెందారు. తూర్పు లద్ధాఖ్ సరిహద్దుల నుంచి సైనికులను వెనక్కి తీసుకుంటూనే చైనా తన బోర్డర్‌ను ఆధునీకరిస్తు వచ్చింది. యుద్ధ విమానాలు, ఆయుధ సామాగ్రిని భద్రపరిచేందుకు కాంక్రట్ నిర్మాణాలను ఏర్పాటు చేసుకోవడమే కాకుండా…