ఇండియాలో కరోనా కేసులు నిన్నటి కంటే కాస్త పెరిగాయి. తాజాగా కేంద్రం కరోనా బులిటెన్‌ను రిలీజ్ చేసింది. ఈ బులిటెన్ ప్రకారం దేశంలో కొత్తగా 45,892 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,07,09,557 కి చేరింది.
read also : కరోనా మరో కొత్త రూపం.. 30 దేశాల్లో గుర్తింపు
ఇందులో 2,98,43,825 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 4,60,704 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 817 మంది మృతి చెందారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు కరోనాతో 4,05,028 మంది మృతిచెందారు. ఇక, గడిచిన 24 గంటల్లో 44,291 మంది కోలుకొని డిశ్చార్జ్ కావడం విశేషం.