కరోనా మరో కొత్త రూపం.. 30 దేశాల్లో గుర్తింపు

కరోనా వైరస్ మరో కొత్త రూపం లోకి మారింది. లాంబ్డా వేరియంట్‌తో ఐరోపా దేశాల్లో భయాందోళనలు సృష్టిస్తుంది. దీంతో డబ్ల్యూహెచ్‌వో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. లాంబ్డా వేరియంట్‌పై పరిశోధనలు జరిపిన మలేషియా ఆరోగ్య మంత్రిత్వశాఖ సంచలన విషయాలను వెల్లడించింది. కరోనా డెల్టా రకం కంటే లాంబ్డా వేరియంట్ అత్యంత ప్రమాదకరమని ప్రకటించింది. ప్రపంచంలోని 30 దేశాల్లో విస్తరించిన లాంబ్డా వేరియంట్ కారణంగా అత్యధిక మరణాలు సంభవించవచ్చని షాకింగ్‌ న్యూస్‌ తెలిపింది. ప్రపంచంలోనే అత్యధిక కరోనా మరణాల రేటు ఉన్న పెరూ దేశం నుంచి లాంబ్డా జాతి వైరస్ ఉద్భవించిందని మలేషియా ఆరోగ్యమంత్రిత్వశాఖ ట్వీట్ చేసింది.

read also : తెలకపల్లి రవి : కేంద్ర క్యాబినెట్‌ పునర్వ్యవస్థీకరణలో రాజకీయ సత్యాలు

మరోవైపు యూకేలో గుర్తించిన లాంబ్డా కరోనా వేరియంట్ డెల్టా కంటే మూడు రెట్లు ప్రమాదకరమైన అంటువ్యాధి అని పరిశోధకులు తేల్చారు. పెరూలో మే, జూన్ నెలల్లో వెలుగుచూసిన కరోనా వైరస్ నమూనాలలో లాంబ్డా దాదాపు 82 శాతం ఉందని పాన్ అమెరికన్ హెల్త్ ఆర్గనైజేషన్ (పాహో) వెల్లడించింది. మరో దక్షిణ అమెరికా దేశమైన చిలీలో మే, జూన్ నుంచి 31 శాతానికి పైగా నమూనాల్లో లాంబ్డా వేరియంట్ వైరస్ ఉందని గుర్తించారు. లాంబ్డా వైరస్ త్వరగా ప్రబలుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-