INDIA Bloc: ఎన్నికల కమీషన్ ముందు ఇండియా కూటమి 5 డిమాండ్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
INDIA Bloc: ఢిల్లీ రామ్ లీలా మైదానం వేదికగా ఇండియా కూటమి నేతలు మహార్యాలీని నిర్వహించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని ఈడీ అరెస్ట్ చేయడంపై బీజేపీపై విరుచుకుపడ్డారు. ఈడీ, ఐటీ, సీబీఐలతో ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. అయితే, ‘‘సేవ్ ఫ్యామిలీ’’, ‘‘అవినీతిని దాచిపెట్టు’’ అనే దాని కోసమే ఈ ర్యాలీని ప్రతిపక్షాలు నిర్వహించాయని బీజేపీ ఆరోపించింది.
ఇదిలా ఉంటే లోక్‌సభ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ ఎన్నికల కమీషన్(ఈసీ)కి 5 డిమాండ్లను చేసింది.
Also Read
- Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
- CJP: ‘‘సంతకాలు చేసి ఉల్లంఘించారు’’.. కాక్రోచ్ నేతలను జైలుకు పంపడానికి కారణాలివే.!
- Real Estate Boom: రియల్ ఎస్టేట్‌కు జోష్.. ఇళ్ల ధరల్లో 12 శాతం పెరుగుదల.. కొనుగోలుదారుల చూపు అటువైపే
- CJP: ‘‘దేశాన్ని నాశనం చేస్తున్నారు’’.. అభిజిత్ దీప్కేకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అవమానం..
* కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నిధులను స్తంభింపచేయడం, ఐటీ శాఖ నోటీసుల గురించి ప్రస్తావిస్తూ.. ప్రతిపక్ష పార్టీల ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం ఆపాలని కోరారు.
* ఈడీ, సీబీఐ, ఐటీ శాఖ చర్యలను నిలిపేయాలని డిమాండ్ చేశారు.
* ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ ద్వారా బిజెపి “దోపిడీ” చేసిన నిధులను సుప్రీం కోర్టు పర్యవేక్షించే ద్వారా ప్రత్యేక దర్యాప్తు బృందం చేత దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.
* లోక్‌సభ ఎన్నికల్లో అందరికి సమాన అవకాశాలు ఉండేలా చూడాలి.
* హేమంత్ సోరెన్, అరవింద్ కేజ్రీవాల్‌ని తక్షణమే విడుదల చేయాలి.
ఈ ఎన్నికల తర్వాత బీజేపీ రాజ్యాంగాన్ని మార్చేయాలని చూస్తోందని, ఆ తర్వాత దేశం మంటల్లో కూరుకుపోతుందని రాహుల్ గాంధీ హెచ్చరించారు. ప్రజాస్వామ్యం కావాలో, నియంతృత్వం కావాలో తేల్చుకోవాలని ప్రజలే నిర్ణయించుకోవాలని మల్లికార్జున ఖర్గే అన్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఒక వ్యక్తి కాదని ఒక సిద్ధాంతమని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అన్నారు.
తాజావార్తలు
-
Sharannavaratri Special: శరన్నవరాత్రుల్లో ప్రత్యేక ఆకర్షణ.. కోటి రూపాయల కరెన్సీ నోట్లతో అమ్మవారికి విశేష అలంకరణ!
-
Haindava Teaser: “ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?”.. ‘హైందవ’ టీజర్ చూశారా!
-
Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్‌డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
-
AP Alliance Seat Sharing: సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి.. కూటమి నుంచి సింగిల్ లిస్ట్.. బొలిశెట్టి కీలక వ్యాఖ్యలు
-
Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..