India Bangladesh: బంగ్లాదేశ్‌కు టర్కీ అధ్యక్షుడి కొడుకు.. భారత్‌కు ప్రమాద హెచ్చరిక..
- బంగ్లాదేశ్‌కు వెళ్లిన టర్కీ అధ్యక్షుడి కొడుకు..
- పలు ప్రాంతాల్లో సందర్శన..
- భారతదేశానికి భద్రతా హెచ్చరికలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Bangladesh: బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) ప్రభుత్వం కొలువుదీరింది. దీని అధ్యక్షుడు తారిక్ రెహ్మాన్ బంగ్లాదేశ్ కొత్త ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. గత రెండేళ్లుగా బంగ్లాదేశ్‌లో భారత వ్యతిరేకత, హిందూ విద్వేషాన్ని రెచ్చగొడుతున్న మహ్మద్ యూనస్ ఇక దిగిపోతున్నాడు. ఇదిలా ఉంటే, మతోన్మాద జమాతే ఇస్లామీ పార్టీ 300 స్థానాలకు గానూ 77 సీట్లను గెలుచుకుంది. ఆ పార్టీ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషించబోతోంది. బంగ్లాదేశ్‌లో ముఖ్యంగా, భారత సరిహద్దు ప్రాంతాల్లో జమాత్ క్లీన్‌స్వీప్ చేసింది. ఈ పరిస్థితిని పాకిస్తాన్, టర్కీ వంటి దేశాలు ఉపయోగించుకోవాలని చూస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ తన కుమారుడు బిలాల్ ఎర్డోగన్‌ను బంగ్లాదేశ్‌కు పంపారు. బిలాల్ ఎర్డోగన్ బంగ్లాదేశ్‌కు వచ్చే సమయానికి, తారిక్ రెహమాన్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 24 గంటల కంటే తక్కువ సమయం మాత్రమే గడిచింది. దీనిని చూస్తే ఈ పర్యటన చాలా ప్రత్యేకతతో కూడుకున్నదని తెలుస్తోంది. టర్కీ, పాక్ సంబంధాలు భారత్‌కు వ్యతిరేకంగా ఉన్నాయి. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్‌కు టర్కీ డ్రోన్లను ఇవ్వడమే కాకుండా, వాటిని ఆపరేట్ చేయడానికి మనుషుల్ని కూడా పంపింది.
Also Read
- Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేష్ కుమార్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. మరోసారి విపక్షాల భారీ ప్లాన్..!
- Supreme Court: ట్రాఫిక్ చలాన్లు ఎగ్గొడుతున్నారా? అయితే కరెంట్ బిల్‌తో కలిపేయండి! సుప్రీంకోర్టు ఊహించని సలహా..
- NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
- Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
ప్రస్తుతం ఎర్డోగాన్ కొడుకు ఢాకాకు రావడం ఇండియాకు ఆందోళన కలిగిచే పరిణామంగా చెప్పవచ్చు. ఆయనతో పాటు టర్కిష్ మాజీ ఫుట్‌బాల్ క్రీడాకారుడు మెసుత్ ఓజిల్, టర్కీ ప్రభుత్వ మద్దతుగల సహాయ సంస్థ TIKA చైర్మన్ అబ్దుల్లా ఆరోన్ కూడా ఉన్నారు. ముఖ్యంగా జమాతే ఇస్లామికి చెందిన పలు ప్రాజెక్టుల్లో టర్కీ పెట్టుబడులు పెట్టింది. ఢాకా యూనివర్సిటీలో నిర్మించిన వైద్య కేంద్రానికి టర్కీ నిధులు ఇచ్చింది. ఇప్పుడు దీనిని ప్రారంభించారు. బిలాల్ టీమ్ గురువారం కాక్స్ బజార్‌లోని రోహింగ్యా శరణార్థి శిబిరాన్ని కూడా సందర్శించనుంది.
ఈ పర్యటన భారత్‌కు వ్యతిరేకంగా ఉన్నట్లు తెలుస్తోంది. టర్కీకి చెందిన TIKA, భారత్‌కు సమీపంలోని లాల్‌మోనీర్హాట్ లోని సాంకేతిక సంస్థల్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. టర్కీ సంస్థలకు, ఎన్‌జీవోలకు జమాతే ఇస్లామీ గ్రూపులతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇవన్నీ పాన్ ఇస్లామిక్ భావజాలాన్ని ప్రోత్సహిస్తున్నాయి. స్థానిక రాజకీయాలను ప్రభావితం చేయవచ్చని నిఘా వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గతంలో షేక్ హసీనాకు వ్యతిరేకంగా విద్యార్థుల్ని రెచ్చగొట్టడంతో జమాతే పాత్ర ఉంది. దీనికి పాక్ ఐఎస్ఐ నుంచి నిధులు వచ్చాయి.
తాజావార్తలు
-
Fauji vs Spirit: రిలీజ్ ప్లాన్‌లో మార్పులు.. ‘ఫౌజీ’ కంటే ముందే ‘స్పిరిట్’?
-
Virat Kohli: ఇక విరాట్ కోహ్లీని ఎవరూ టచ్ చేయలేరు: కైఫ్
-
AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
-
Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేష్ కుమార్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. మరోసారి విపక్షాల భారీ ప్లాన్..!
-
YS Jagan: నేడు ఒంగోలుకు వైఎస్ జగన్.. కాకుమాను రాజశేఖర్ కుటుంబానికి పరామర్శ
ట్రెండింగ్
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!