Jairam Ramesh: టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ వచ్చే వారం భారత పర్యటనకు వస్తున్నారని అంతా అనుకున్నప్పటికీ, చివరి నిమిషంలో ఆయన తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఆయన తన భారత పర్యటనలో టెస్లా కార్ ప్లాంట్ కోసం 2-3 బిలియన్ డాలర్ల పెట్టుబడిన ప్రకటిస్తారని, ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అవుతారని అంతా అనుకున్నారు. అయితే, ఎలాంటి కారణాలు లేకుండా పర్యటన వాయిదా పడింది.
Read Also: Asaduddin Owaisi: ఒవైసీ వ్యాఖ్యలపై మండి పడ్డ నిర్మలా సీతారామన్.. అసలేమన్నాడంటే?
ఇదిలా ఉంటే మస్క్ పర్యటన వాయిదా పడటంపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి ప్రధాని మస్క్‌ని ఆహ్వానిస్తారని అన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఏర్పడేది ఇండియా కూటమి ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. ‘‘ పదవీ విరమణ చేసే ప్రధానమంత్రిని కలవడానికి భారత్ వరకు వస్తున్నారు. ఇండియా కూటమి గెలుస్తుందని తెలుసుకుని తన పర్యటన వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు. ఇండియా కూటమి ప్రధాని త్వరలో ఆయనకు స్వాగతం పలుకుతారు. ఇండియా కూటమి ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను మరింత దూకుడుగా ప్రోత్సహిస్తుంది. నేను కూడా దాని వినియోగదారుడినే’’ అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
జైరాం రమేష్ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా 543 లోక్‌సభ స్థానాలకు ఏడు దశల్లో ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఎన్నికలు జరగుతున్నాయి. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికే శుక్రవారం తొలివిడతలో 21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 ఎంపీ స్థానాలకు ఎన్నికలు ముగిశాయి.
It was odd that @elonmusk was coming all the way to India to meet an outgoing Prime Minister. He too has now read the writing on the wall and decided to put off his visit.
INDIA’s PM will welcome him soon, and the INDIA Government will promote electric vehicles even more…
— Jairam Ramesh (@Jairam_Ramesh) April 20, 2024