జగదీప్ ధన్‌ఖర్ అనూహ్యంగా ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. దీంతో ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటికే ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. సెప్టెంబర్ 9న ఎన్నిక జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు పోలింగ్ జరగనుంది. అదేరోజు ఫలితం విడుదల కానుంది.
ఇది కూడా చదవండి: UP: నది ఒడ్డున ప్రేమికుడు, కొండపై ప్రియురాలి మృతదేహాలు.. చంపిందెవరు..?
ఇక ఉపరాష్ట్రపతి పదవిని కైవసం చేసుకునేందుకు అధికార ఎన్డీఏ కూటమికి సంపూర్ణ మద్దతు ఉంది. ఈజీగా ఈ ఎన్నిక గెలవనుంది. అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి కూడా పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకోసం మల్లిఖార్జున ఖర్గే విపక్ష పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఏకాభిప్రాయం కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వర్గాలు పేర్కొన్నాయి.
ఇది కూడా చదవండి: Gold Prices: పసిడి మెరుపులకు సుంకాలు కారణం అయ్యాయా?… బంగారం ధరలు ఎంతవరకు పెరగవచ్చు..
అధికారికంగా చర్చలు ఇంకా ప్రారంభం కానప్పటికీ.. అనధికారికంగా మాత్రం కూటమి నేతల మధ్య చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. రాబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఉమ్మడి అభ్యర్థిని నామినేట్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించిన తర్వాతే ఇండియా కూటమి తమ అభ్యర్థిని నిలబెట్టాలని ఆలోచన కలిగి ఉన్నట్లు వర్గాలు వెల్లడించాయి.
ఇది కూడా చదవండి: Kalyan Banerjee: ఆమెతో సమయం వృధా.. మహువా మోయిత్రాపై కళ్యాణ్ బెనర్జీ కీలక వ్యాఖ్యలు
ఎన్నిక ఫలితం ఎలా ఉన్నప్పటికీ ఒక బలమైన రాజకీయ సందేశం పంపించాలని ప్రతిపక్ష పార్టీలు యోచన చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా విపక్షాల ఐక్యతను కూడా చూపించాలని కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల రాహుల్ గాంధీ విందు కూడా ఇచ్చారు. ఈ విందులో 25 పార్టీల నుంచి అనేక మంది నాయకులు పాల్గొన్నారు. వీరిలో ఖర్గే, సోనియా గాంధీ, రద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్, అభిషేక్ బెనర్జీ, ఉద్ధవ్ థాకరే, తిరుచ్చి శివ, TR బాలు, CPI(M)కి చెందిన MA బేబీ, CPIకి చెందిన రాజా, CPI(ML)కి చెందిన దీపాంకర్ భట్టాచార్య, కమల్ హాసన్ ఉన్నారు. ఈ సమావేశాన్ని అత్యంత విజయవంతమైన సమావేశాలలో ఒకటిగా కేసీ. వేణుగోపాల్ అభివర్ణించారు.
ఇది కూడా చదవండి: Trump-Putin: ట్రంప్-పుతిన్ భేటీకి జెలెన్‌స్కీ ఆహ్వానం.. వైట్‌హౌస్ ఏం చెప్పిందంటే..!