BJP: “అయోధ్య రాముడి” నినాదంతో లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ ప్లాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ సిద్ధమవుతోంది. మూడోసారి వరసగా అధికారంలోకి వచ్చేందుకు కసరత్తు ప్రారంభించింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 50 శాతం ఓట్లను పొందడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే తన పార్టీ కార్యకర్తలకు, నేతలకు దిశానిర్దేశం చేసింది. జనవరి 22, 2024లో అయోధ్యంలో భవ్య రామమందిర ప్రారంభోత్సవం జరగబోతోంది. మోడీ హయాంలో ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ నెరవేరబోతోంది. అయితే అయోధ్య రామమందిర ప్రతిష్టాపనను సద్వినియోగం చేసుకోవాలని పార్టీ, కార్యకర్తలను కోరింది.
పార్టీ ఆఫీస్ బేరర్‌లతో ఇటీవల బీజేపీ రెండు రోజుల కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో వచ్చే ఎన్నికల్లో గెలుపు వ్యూహాలను గురించి చర్చించారు. ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్రమోడీతో పాటు హోం మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా హాజరయ్యారు. వీరు పార్టీ శ్రేణులకు బలమైన సందేశాన్ని ఇచ్చారు.
Also Read
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
- BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
- Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
- Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
Read Also: Bengaluru: బెంగళూర్ దుకాణాల సైన్‌బోర్డుల్లో 60 శాతం కన్నడలో ఉండాల్సిందే..
రాముడే కొండంత బలంగా:
రామ మందిర ప్రతిష్టాపన వేడుకలనే బీజేపీ విజయానికి మూలస్తంభంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ వేడుకలను ఎన్నికల ప్రచారం అంశంలో సమర్థవంతంగా ఉపయోగించుకుని ఓట్లు రాబట్టేందుకు వ్యూహాలను సిద్ధం చేసింది. రామ మందిర ఉద్యమం, ఆలయ నిర్మాణంలో బీజేపీ పాత్రను తెలియజేసేలా బుక్‌లెట్ విడుదల చేయనున్నారు. కొత్త ఓటర్లను కనెక్ట్ కావడానికి, వారి భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు బూత్ స్థాయి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. తమ ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష పార్టీలు ఆలయ నిర్మాణాన్ని ఎలా అడ్డుకోవడానికి ప్రయత్నించాయనే విషయాన్ని కూడా బీజేపీ హైలెట్ చేయనుంది. రామ మందిరానికి సంబంధించి ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) నిర్వహించే అన్ని కార్యక్రమాలకు బీజేపీ మద్దతు ఇవ్వనుంది.
భారీ మెజార్టీ టార్గెట్:
రెండు రోజుల పాటు జరిగిన ఈ సమావేశంలో, బీజేపీ అధిక మార్జిన్‌తో విజయం సాధించడమే టార్గెట్‌గా పెట్టుకోవాలని ఆఫీస్ బేరర్లకు అమిత్ షా సూచించారు. అధిక తేడాతో గెలుస్తామని నిర్ధారించుకోవాలని, దీంతో ప్రతిపక్షాలు బీజేపీ ముందు నిలబడేందుకు ధైర్యం చేయవని అన్నారు. ఉత్తర్ ప్రదేశ్‌లో బలంగా ఉన్నాము, ఇతర చోట్ల బలహీనంగా ఉన్నామనే భావన వదిలేయాలని, బలహీనమైన స్థానాలు ఏమీ లేవని ఎన్నికలకు సిద్ధం కావాలని బీజేపీ అధిష్టానం దిశానిర్దేశం చేసింది. ఇదిలా ఉంటే ఎన్నికల కంటే చాలా ముందుగానే ఎన్నికల్లో బలహీనంగా ఉన్న స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాలని బీజేపీ భావిస్తోంది.
తాజావార్తలు
-
Pulsar NS400Z: Pulsar NS400Z కొత్త వెర్షన్ లాంచ్.. TFT డిస్ప్లే, Google Maps సహా మరిన్ని స్మార్ట్ ఫీచర్లు
-
Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
-
Blood Donation Camp: రక్తదాన శిబిరంలో ‘కులం’ కలకలం.. తమిళనాడులో వివాదం
-
Vaishnav Tej: 100 కోట్ల హిట్టు కొట్టినా.. ‘ఉప్పెన’ హీరో ఏం చేస్తున్నాడు?.. ఇంత గ్యాప్ ఎందుకు?
-
Sardar 2 : కార్తీపై గుర్రుగా ఉన్న తమిళనాడు థియేటర్స్ యాజమాన్యం
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?