Pulsar NS400Z: Pulsar NS400Z కొత్త వెర్షన్ లాంచ్.. TFT డిస్ప్లే, Google Maps సహా మరిన్ని స్మార్ట్ ఫీచర్లు
- Bajaj Pulsar NS400Z కొత్త మోడల్ వచ్చేసింది
- 40PS పవర్, అదిరిపోయే ఫీచర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bajaj Pulsar NS400Z TFT Variant: బజాజ్ ఆటో ప్రముఖ Pulsar NS400Z బైక్‌ను కీలకమైన టెక్నాలజీ అప్డేట్లతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. కొత్త వేరియంట్లో పాత LCD ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌కు బదులుగా 5-అంగుళాల TFT డిస్ప్లేను అందించారు. దీంతో బైక్‌లో Google Maps నావిగేషన్, మ్యూజిక్ కంట్రోల్, డాక్యుమెంట్ స్టోరేజ్ వంటి కనెక్టెడ్ ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. కొత్త TFT వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.1.90 లక్షలుగా ఉంది. పనితీరుతో పాటు ఆధునిక టెక్నాలజీ ఫీచర్లు కోరుకునే రైడర్లను దృష్టిలో పెట్టుకుని ఈ అప్డేట్ చేసిన మోడల్‌ను తీసుకొచ్చారు.
5-అంగుళాల TFT క్లస్టర్
Pulsar NS400Zలో ప్రధాన మార్పు కొత్త 5-అంగుళాల TFT ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. బజాజ్ తన ఇతర మోడళ్లలోనూ TFT క్లస్టర్లను అందిస్తోంది. ఇప్పుడు NS400Zలో కూడా ఇదే టెక్నాలజీని తీసుకొచ్చింది. ఈ TFT క్లస్టర్ స్మార్ట్‌ఫోన్‌తో కనెక్ట్ అయి పలు స్మార్ట్ ఫీచర్లను అందిస్తుంది.
Also Read
- Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
- Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
- Porsche Cayenne Electric: Porsche Cayenne Electric భారత్‌లో లాంచ్.. 623 కి.మీ రేంజ్, 2.5 సెకన్లలో 100 kmph
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
Google Maps సపోర్ట్
కొత్త క్లస్టర్ Bluetooth, Wi-Fi కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. దీని ద్వారా స్మార్ట్‌ఫోన్‌ను బైక్‌తో కనెక్ట్ చేసి Google Maps నావిగేషన్‌ను బైక్ స్క్రీన్‌పైనే చూడవచ్చు. Android స్మార్ట్‌ఫోన్‌తో కనెక్ట్ చేసినప్పుడు Google Maps నావిగేషన్ ఉపయోగిస్తున్న సమయంలో ఫోన్ స్క్రీన్‌ను ఆఫ్‌లో ఉంచే అవకాశం కూడా ఉందని కంపెనీ తెలిపింది. రైడింగ్ సమయంలో ఫోన్‌ను పదేపదే చూడాల్సిన అవసరాన్ని తగ్గించే ఫీచర్‌గా ఇది ఉపయోగపడుతుంది.
డాక్యుమెంట్ స్టోరేజ్.. మ్యూజిక్ కంట్రోల్
కొత్త TFT క్లస్టర్లో నావిగేషన్‌తో పాటు మరిన్ని ఫీచర్లు ఉన్నాయి. వీటిలో Google Maps నావిగేషన్, మ్యూజిక్ కంట్రోల్, డాక్యుమెంట్ స్టోరేజ్, ల్యాప్ టైమర్, స్మార్ట్‌ఫోన్, కనెక్టివిటీ పలు రైడింగ్ సమాచారం ఇవన్నీ కొత్త TFT క్లస్టర్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు. Pulsar NS400Zలో మొత్తం నాలుగు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. Road, Rain, Sport, Off-Road. రైడింగ్ పరిస్థితులకు అనుగుణంగా వీటి మధ్య మారవచ్చు. కొత్త TFT క్లస్టర్‌ను సులభంగా ఆపరేట్ చేసేందుకు బైక్‌లో అప్డేటెడ్ స్విచ్గియర్ను కూడా అందించారు.
ఇతర ఫీచర్లు
USB Type-C పోర్ట్
Panic Brake Alert
ఆల్-LED లైటింగ్
USD ఫ్రంట్ ఫోర్క్స్
సింటర్డ్ బ్రేక్ ప్యాడ్స్
అడ్జస్టబుల్ లీవర్స్
క్విక్ షిఫ్టర్
స్లిప్పర్ క్లచ్
349cc ఇంజిన్.. 40PS పవర్
ఇంజిన్ పరంగా కొత్త TFT వేరియంట్లో ఎలాంటి పెద్ద మార్పు చేయలేదు. ఇందులో 349cc సింగిల్-సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ ఉంది. 4-వాల్వ్, DOHC ఇంజిన్ హెడ్‌ను ఇందులో ఉపయోగించారు. ఈ ఇంజిన్ గరిష్ఠ పవర్: 40PS @ 9,000rpm, గరిష్ఠ టార్క్: 33Nm @ 7,500rpm, గేర్‌బాక్స్: 6-స్పీడ్, అలాగే ఎలక్ట్రానిక్ థ్రాటిల్, స్లిప్పర్ క్లచ్, క్విక్ షిఫ్టర్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
తాజావార్తలు
-
Pulsar NS400Z: Pulsar NS400Z కొత్త వెర్షన్ లాంచ్.. TFT డిస్ప్లే, Google Maps సహా మరిన్ని స్మార్ట్ ఫీచర్లు
-
Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
-
Blood Donation Camp: రక్తదాన శిబిరంలో ‘కులం’ కలకలం.. తమిళనాడులో వివాదం
-
Vaishnav Tej: 100 కోట్ల హిట్టు కొట్టినా.. ‘ఉప్పెన’ హీరో ఏం చేస్తున్నాడు?.. ఇంత గ్యాప్ ఎందుకు?
-
Sardar 2 : కార్తీపై గుర్రుగా ఉన్న తమిళనాడు థియేటర్స్ యాజమాన్యం
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?